కాంగ్రెస్ నేతలపై అస్సాం సీఎం ఫైర్.. రూ.500 కోట్ల పరువునష్టం దావా
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:42 PM
కాంగ్రెస్ నేతలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని సీఎం పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అస్సాం(Assam) అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 1200 బిఘాల(భూమిని కొలిచే పరిమాణం) భూమిని ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సీఎం.. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) మీడియాతో మాట్లాడుతూ..' కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు, దురుద్దేశపూర్వకంగా పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్‌ల నుంచి రూ.500 కోట్ల నష్ట పరిహారం కోరుతూ దావా వేశాను’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అంతకముందు సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ నేత గొగొయ్ మాట్లాడుతూ.. ఓ వర్గంపై ముఖ్యమంత్రి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ వార్తలూ చదవండి:
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్