Home » Congress
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, గత పదేళ్లలో ఏకంగా 152 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న( సోమవారం) జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్‌తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అఖిలపక్ష సమావేశంలో మద్దతు లభించిందంటూ వస్తున్న వార్తల్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అబద్ధం, ఫేక్ న్యూస్ అని ఆయన కొట్టిపారేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ గురించి.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్ సమయమిచ్చినా సద్వినియోగం చేసుకోలేదన్నారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి ఎలాగైనా సంఖ్యా బలాన్ని కూడగట్టుకుని బిల్లులను గట్టెక్కించాలని పావులు కదుపుతోంది.
దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
కుమ్ములాటలు, వర్గపోరుకు పెట్టింది పేరు కాంగ్రెస్. పార్టీ నేతలు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు. పరస్సపరం విమర్శలు చేసుకుంటారు. తర్వాత అంతా ఒకటే అని ఐక్యతా రాగం ఆలిపిస్తారు.
భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ విద్యా వ్యవస్థ ప్రస్తుతం నిజాయతీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఎంపీ రాహుల్ గాంధీ పోస్టు పెట్టారు.
రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.