Naini Rajender Slams Rajaiah: రాజయ్యకు సిగ్గు, శరం లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:50 AM
రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు.
హనుమకొండ, అక్టోబర్ 21: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Former MLA Tatikonda Rajaiah)వాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Congress MLA Naini Rajender) స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తాటికొండ రాజయ్యకు సిగ్గు, శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాజయ్యను కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేశారో ఇప్పటి వరకూ తెలియదన్నారు. రాజయ్య ఎవరికి ఫోన్ చేయబోయి ఎవరికి చేస్తే... మంత్రి పదవి ఊడిందో తెలియదా అని కామెంట్స్ చేశారు. రాజయ్యను తొలగిస్తే ఆయన తరఫున తాము మాట్లాడామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో వ్యవస్థలో గౌరవం లేకుండా, అభద్రత భావాన్ని కలిగించేలా చేశారని మండిపడ్డారు. ప్రమోద్ అనే కానిస్టేబుల్ మృతిని రాజకీయం చేయడం సిగ్గు చేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ డిపాజిట్ కూడా రాదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
కాగా... కాంగ్రెస్‌లో వర్గపోరుపై స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలకు కారణం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరే అంటూ ఆరోపణలు గుప్పించారు. కొండా సురేఖ మంత్రి పదవి లాక్కోవాలని కడియం కుట్రలు చేస్తున్నారని అన్నారు. బీసీ మంత్రిని కావాలనే మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి కలిసి కొండా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
వైజాగ్కి గూగుల్ పెట్టుబడి రావడానికి కారణం శాంతి భద్రతలు: సీఎం చంద్రబాబు-
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
Read Latest Telangana News And Telugu News