RTC Cross Roads accident: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రమాదం.. ఫైరింజన్ ఢీకొని ఒకరి మృతి..
ABN , Publish Date - Oct 21 , 2025 | 09:07 AM
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయాలపాలయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వీఎస్టీ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది (Hyderabad road accident).
బండ్లగూడాకు చెందిన ఓ కుటుంబం యాక్టివా స్కూటీపై రాంనగర్ వైపు వెళ్తోంది. ప్రమాదవశాత్తు ఫైర్ ఇంజన్ వెనుక టైర్ కింద ఆ స్కూటీ పడింది. ఆ బైక్ మీద ఫాతిమా అనే మహిళ తన కొడుకు ఇబ్రహీం, కూతురు మోహిక్‌తో కలిసి వెళ్తోంది. ఈ ప్రమాదంలో మెహిక్ (16) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది (RTC Cross Roads accident).
తల్లి ఫాతిమా, కొడుకు ఇబ్రహీం తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు (one dead in Hyderabad accident). తల్లి కొడుకులను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని సమాచారం.
ఇవి కూడా చదవండి..
డీల్ ఆర్ నో డీల్.. చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు.. ట్రంప్ బెదిరింపు..
స్వల్పంగా తగ్గింది.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..