US China trade war: డీల్ ఆర్ నో డీల్.. చైనా ఒప్పుకోకపోతే 155 శాతం సుంకాలు.. ట్రంప్ బెదిరింపు..
ABN , Publish Date - Oct 21 , 2025 | 07:17 AM
చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ రెండువారాల్లో సమావేశం కాబోతున్నారు.
చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ రెండువారాల్లో సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అమెరికా అధ్యక్షుడు మరోసారి బెదిరింపులకు దిగారు (Trump China tariff).
అమెరికాతో ఒప్పందం కుదుర్చకోకపోతే చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు (155% tariff Trump). ఆ పెరిగిన సుంకాలను చైనా నవంబర్ ఒకటో తేదీ నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని, అందుకే భారీ సుంకాలు చెల్లిస్తోందని వ్యంగ్యంగా అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రెండు వారాల్లో దక్షిణ కొరియాలో ట్రంప్ సమావేశం కాబోతున్నారు.
కాగా, సోమవారం మాట్లాడిన ట్రంప్.. చైనాపై విధించిన సుంకాలు శాశ్వాతం కాదన్నారు (Trump Xi Jinping conflict). చైనా చర్యల వలనే వారిపై అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందన్నారు. ఆ సుంకాలు స్థిరంగా అలాగే కొనసాగుతాయని చెప్పడం లేదన్నారు. తాను సుంకాలు విధించేలా చైనా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. అయితే 24 గంటలు గడిచే లోపే ట్రంప్ తన మాట మార్చారు.
ఇవి కూడా చదవండి..
వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాపై సుంకాల గురించి ట్రంప్ ఏమన్నారంటే..
భారత్‌తో దోస్తీకి బ్రెజిల్ ఆసక్తి.. ఇరు దేశాలు కలిసి నడిస్తే..
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..