Telangana Cabinet Meeting Tomorrow: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 05:06 PM
కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్ఎల్‌బీసీ పునరుద్ధరణ, ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు రామిరెడ్డి దామోదర రెడ్డి పేరుకు ఆమోదం, కాళేశ్వరం పునరుద్ధరణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది.
హైదరాబాద్: గురువారం నాడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం న్యాయ నిపుణుల కమిటీ వేసింది. న్యాయ నిపుణుల రిపోర్ట్ ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ ఈ నివేదికపై చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై సమాలోచనలు జరపనుంది.
అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఎల్‌బీసీ పునరుద్ధరణ, కాళేశ్వరం పునరుద్ధరణ, తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల నిర్మాణం సహా పలు నీటి పారుదల ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితోపాటు మరికొన్ని ప్రభుత్వ పాలసీ విధానాలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ఇటుక దెబ్బకు క్షణాల్లో ప్రాణాలు పోయాయి..
గ్రామస్తులపై దాడి చేసిన చిరుత.. అందరూ ధైర్యంగా ఎదురించి..