Man Hit By Brick: ఇటుక దెబ్బకు క్షణాల్లో ప్రాణాలు పోయాయి..
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:28 PM
ప్రత్యర్థి పెద్ద ఇటుకతో కిందపడ్డ రవీంద్ర తలపై కొట్టాడు. అంతే ఒకే దెబ్బకు రవీంద్ర ప్రాణాలు పోయాయి. అతడు చనిపోగానే ప్రత్యర్థులు అక్కడి నుంచి పారిపోయారు.
ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గొడవల కారణంగా పట్టపగలు ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఇటుక దెబ్బకు ఓ వ్యక్తి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. కిందపడ్డ ఆ వ్యక్తి.. పైకి లేవకుండానే చనిపోయాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్ గంజ్ ఏరియాలో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది.
నడిరోడ్డుపై జరిగిన ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా తయారైంది. రెండు గ్రూపులు రాళ్లతో దాడి చేసుకోవటం మొదలెట్టాయి. రవీంద్ర అలియాస్ మన్ను అనే వ్యక్తి కారు వెనకాల నిలబడి ప్రత్యర్థులపై రాళ్లతో దాడి చేయటం మొదలెట్టాడు. ప్రత్యర్థులు ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. రవీంద్రకు దగ్గరగా వచ్చి దాడి చేయటం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే రవీంద్ర వారి నుంచి తప్పించుకోవటానికి పరిగెత్తే ప్రయత్నం చేశాడు.
మూడు అడుగు వెళ్లగానే ఠక్కున కిందపడిపోయాడు. ప్రత్యర్థి వెనక నుంచి వచ్చి పెద్ద ఇటుకతో రవీంద్ర తలపై కొట్టాడు. అంతే ఒకే దెబ్బకు రవీంద్ర ప్రాణాలు పోయాయి. అతడు చనిపోగానే ప్రత్యర్థులు అక్కడి నుంచి పారిపోయారు. రవీంద్ర మరణంతో కుటుంబసభ్యులు, సహోద్యోగులు ఆగ్రహానికి గురయ్యారు. మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి నిరసనలకు దిగారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
గ్రామస్తులపై దాడి చేసిన చిరుత.. అందరూ ధైర్యంగా ఎదురించి..
అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన రోడ్డును..