Share News

Newly Built Road In Bihar: అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన రోడ్డును..

ABN , Publish Date - Oct 22 , 2025 | 03:03 PM

ఓ మహిళ కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డును పాడు చేసి కాంక్రీట్ ఎత్తుకెళ్లిపోయింది. అది కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా భయపడకుండా కాంక్రీట్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Newly Built Road In Bihar: అందరూ చూస్తుండగానే కొత్తగా వేసిన రోడ్డును..
Newly Built Road In Bihar

వర్షా కాలం రాగానే రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చంద్రుడి ఉపరితలాన్ని తలపిస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద గుంతలు, బురద నీటితో నడవడానికి నరకం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. జనం రోడ్లు బాగు చేయించని ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో రోడ్లు వేసినా లాభం లేకుండా పోతోంది.


మరీ ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వింత, విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. కొత్తగా వేసిన రోడ్లను గంట కూడా గడవక ముందే జనం పాడు చేసిన సంఘటనలు చాలా జరిగాయి. మరీ ముఖ్యంగా బిహార్ రాష్ట్రంలో జనం బరితెగిస్తున్నారు. గతంలో కొంతమంది జనం అప్పుడే వేసిన రోడ్డును పాడు చేసి డాంబర్ తీసుకెళ్లిపోయారు. మరో ఘటనలో కాంక్రీట్ తీసుకెళ్లిపోయారు. తాజాగా, కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది.


ఓ మహిళ కొత్తగా వేసిన కాంక్రీట్ రోడ్డును పాడు చేసి కాంక్రీట్ ఎత్తుకెళ్లిపోయింది. అది కూడా అందరూ చూస్తుండగానే కొంచెం కూడా భయపడకుండా కాంక్రీట్ తీసుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మీలాంటి వాళ్ల వల్లే బిహార్ ఇంకా వెనుకబడిపోయింది. మీరు మారితే గానీ రాష్ట్రం బాగుపడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏంటో తెలుసా?

ఎండుద్రాక్షలో ఏది ఎక్కువ మంచిది

Updated Date - Oct 22 , 2025 | 03:33 PM