Leopard Attacks Villagers: గ్రామస్తులపై దాడి చేసిన చిరుత.. అందరూ ధైర్యంగా ఎదురించి..
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:53 PM
పాలక్‌వా గ్రామంలోకి అక్టోబర్ 20వ తేదీన చిరుత ప్రవేశించింది. పొలాల్లోని పొదల మాటున దాక్కుంది. అటువైపు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చిరుత పులి అరుపులు విన్నారు. భయంతో అరుస్తూ గ్రామంలోకి పరుగులు తీసే ప్రయత్నం చేశారు.
ఈ మధ్య కాలంలో అడవి జంతువులు జనావాసాల్లోకి రావటం.. ప్రజలపై దాడులు చేయటం బాగా పెరిగిపోయింది. క్రూర జంతువుల కారణంగా మూగ జీవాలతో పాటు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. అడవికి దగ్గరగా ఉండే గ్రామాల్లోని ప్రజల పరిస్థితి దిన దిన గండంలా తయారైంది. తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామంలోకి చిరుత వచ్చింది. గ్రామస్తులపై విచక్షణా రహితంగా దాడి చేసింది. గ్రామస్తులందరూ ఎంతో ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నారు.
కర్రలతో కొట్టి దాన్ని తరిమేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉనా జిల్లాలోని పాలక్‌వా గ్రామంలోకి అక్టోబర్ 20వ తేదీన చిరుత ప్రవేశించింది. పొలాల్లోని పొదల మాటున దాక్కుంది. అటువైపు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చిరుత పులి అరుపులు విన్నారు. భయంతో అరుస్తూ గ్రామంలోకి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ చిరుత వారిపై దాడి చేసింది. ముగ్గురిని తీవ్రంగా గాయపరిచింది. విషయం తెలుసుకున్న 20 మంది దాకా గ్రామస్తులు కర్రలు, రాళ్లు, రాడ్లతో చిరుత పులిని ఊరినుంచి తరిమే ప్రయత్నం చేశారు.
అది వారిపై కూడా దాడి చేసింది. వారు ఏ మాత్రం భయపడకుండా దాన్ని కర్రలతో రాళ్లతో చితక బాదారు. దెబ్బలు బాగా తగలటంతో అది అక్కడినుంచి పారిపోయింది. చిరుత పులి గురించి సమాచారం అందుకున్న అటవీ అధికారులు గ్రామానికి వచ్చారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ వేసి పట్టుకున్నారు. మళ్లీ దాన్ని అడవిలో వదిలిపెట్టారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. గ్రామస్తుల ఐక్యత, ధైర్యాన్ని కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భాను ను కస్టడీకి తీసుకున్న NIA
పర్సును ఫోన్‌లా మార్చేశాడుగా.. ఇతడి టెక్నాలజీ చూస్తే అవాక్కవ్వాల్సిందే..