Share News

Adluri Laxman Challenge: హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్

ABN , Publish Date - Oct 21 , 2025 | 01:52 PM

హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు.

Adluri Laxman Challenge: హరీష్‌కు మంత్రి అడ్లూరి ఛాలెంజ్
Adluri Laxman Challenge

హైదరాబాద్, అక్టోబర్ 21: మాజీ మంత్రి హరీష్ రావుకు (Former Minister Harish Rao) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) ఛాలెంజ్ విసిరారు. కేబినెట్‌పై బీఆర్‌ఎస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. కేబినెట్ సమావేశంలో వ్యక్తిగత అంశాలు చర్చ చేయలేదని తాను ప్రమాణం చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మాజీ మంత్రికి సవాల్ విసిరారు మంత్రి. ‘సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామా? హరీష్ సెంటిమెంట్‌గా భావించే దేవుడిపై ప్రమాణం చేయగలడా? ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామా? మా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి నేను ప్రమాణం చేస్తాను. నేను ముఖ్యమంత్రి అనుమతి తీసుకొని వస్తాను. నువ్వు (హరీష్) ఆరోపించిన విషయాలను నిజమని ప్రమాణం చేయగలవా? ఏ శనివారం వస్తారో హరీష్ రావు చెప్పాలి. ఛాలెంజ్‌ను హరీష్ స్వీకరించాలి. కొండా సురేఖ బిడ్డ.. మా అందరికీ బిడ్డ లాంటిదే’ అంటూ మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.


హరీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రులను దండుపాళ్యం బ్యాచ్ అంటారా అంటూ ఫైర్ అయ్యారు. కేబినెట్లో జరగని విషయాలను జరిగాయని ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు 600 పైగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై గత ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని విమర్శించారు. రైతుల చేతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. పదేండ్లు మేమే రాజులం తామే మంత్రులం అన్నట్టు వ్యవహరించారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి..

ఆ ధైర్యం మీకు లేదా.. పార్టీ ఫిరాయింపుదారులకు కేటీఆర్ సూటి ప్రశ్న

విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2025 | 01:57 PM