KTR Visits Basti Clinic: ఆ ధైర్యం మీకు లేదా.. పార్టీ ఫిరాయింపుదారులకు కేటీఆర్ సూటి ప్రశ్న
ABN , Publish Date - Oct 21 , 2025 | 12:28 PM
పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదని.. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే ధైర్యం లేదంటూ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 21: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ (Danam Nagender) పేరు చేర్చటం సిగ్గు చేటని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇబ్రహీంనగర్‌లోని బస్తీ దవాఖానను సందర్శించిన కేటీఆర్.. పేషెంట్‌ల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నామో దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి నీతి ఉందా అంటూ నిలదీశారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదని.. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే ధైర్యం లేదంటూ మండిపడ్డారు. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారన్నారు. ఏఐసీసీ అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ అంటూ మాజీ మంత్రి దుయ్యబట్టారు.
విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదని విమర్శించారు. రాజకీయాలు కాదని.. ప్రజల ప్రాణాలను ముఖ్యమంత్రి పట్టించుకోవాలని హితవుపలికారు. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారిందన్నారు. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయిందని విమర్శించారు. బస్తీ దావాఖాన సిబ్బందికి జీతాలు ఇవ్వాలని... ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందంటూ మండిపడ్డారు.
నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మందితో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే బస్తీ దవాఖానాల్లో ఆకస్మిక తనిఖీలను చేపట్టామని తెలిపారు. బస్తీ దవాఖానాల్లో కనీసం మందులు కూడా అందుబాటులో లేవన్నారు. కేసీఆర్ ముందు చూపుతో కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడలేదని గుర్తుచేశారు. పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారని తెలిపారు. వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. మూడు దేశాల్లో..
రాజయ్యకు సిగ్గు, శరం లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
Read Latest Telangana News And Telugu News