Home » CM Revanth Reddy
తెలుగు వాళ్లందరూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలబడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సుదర్శన్ రెడ్డికి తెలుగు ప్రజల మద్దతు అవసరమని తెలిపారు. తెలుగు అస్తిత్వం కాపాడాల్సిన సమయం ఇదని ఉద్ఘాటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి బరిలోకి రావడం ఎన్డీఏ కూటమికి అతి పెద్ద సవాల్ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై శాసనసభలో ఆదివారం వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడగా..
వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు డిమాండ్ చేశారు.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదికపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆదివారం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య వాడివేడి వాదన కొనసాగింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది.
ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. యువతకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువత తమలోని శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘ చర్చల అనంతరం.. బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం పలికింది. అన్ని పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు త్వరలో కార్యరూపం దాల్చనుంది.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కానీ ఆది శ్రీనివాస్ వరకు ప్రతిఫలాలు వెళ్ళే పరిస్థితులు కాంగ్రెస్‌లో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు.
బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని కేటీఆర్ తెలిపారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలని ఆయన సూచించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు.