Share News

MLA Payal Shankar: కాంగ్రె‌‌స్‌లో.. అధికారంలో ఉండటానికి బీసీలకు అర్హత లేదా..?

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:00 PM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కానీ ఆది శ్రీనివాస్ వరకు ప్రతిఫలాలు వెళ్ళే పరిస్థితులు కాంగ్రెస్‌‌లో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు.

MLA Payal Shankar: కాంగ్రె‌‌స్‌లో.. అధికారంలో ఉండటానికి బీసీలకు అర్హత లేదా..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 42 శాతం రిజర్వేషన్లు మొత్తం బీసీలకు ఇస్తారా..? అందులో 10 శాతం ముస్లింలు లేరా..? అని ఆయన ప్రశ్నించారు. దీనిపై కాగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 42కు 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నామని ప్రభుత్వం ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతుందని నిలదీశారు. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్ల నుంచి 6 శాతం పెంచే విధంగా జీవోలో ఎందుకు పొందు పరిచారని ధ్వజమెత్తారు.


ఆది శ్రీనివాస్‌‌కు సీఎం అయ్యే అవకాశాలున్నాయి..

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని పాయల్ శంకర్ తెలిపారు. కానీ ఆది శ్రీనివాస్ వరకు ప్రతిఫలాలు వెళ్ళే పరిస్థితులు కాంగ్రెస్‌‌లో లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయంటే తెలంగాణ బీసీ సమాజం అంత సంబర పడ్డారని గుర్తు చేశారు. బీసీ బిల్లుకు బీజేపీ వ్యతిరేకం కాదు, మతపరంగా ముస్లింలకు కేటాయిస్తున్న 10 శాతం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం గొప్ప ఆలోచనని కితాబిచ్చారు.


కాంగ్రె‌‌స్‌లో అధికారంలో ఉండటానికి బీసీలకు అర్హత లేదా..?

రాజకీయ లబ్ధి కోసం బీజేపీని బద్నాం చేస్తున్న తీరు తెలంగాణ సమాజం చూస్తుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీసీలను ఆశల పల్లకిలో ఊరేగిస్తూ.. నిలువునా మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు రెండు స్థానాలు ఇవ్వని కాంగ్రెస్ బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రుల పదవులు మీకు.. అధ్యక్షుల పదవులు మాకా. ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రె‌‌స్‌లో బీసీలకు అధికారంలో ఉండటానికి అర్హత లేదా..? అని నిలదీశారు. రాష్ట్రంలో 15 విశ్వవిద్యాలయాలు ఉంటే ఒకటో, రెండో విద్యాలయాలకు మాత్రమే బీసీలు చాన్స్‌లర్లుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమంలో అనేక ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థికశాఖ మంత్రి బీసీల సమస్యలపై తక్షణమే దృష్టి పెట్టీ, పరిష్కరించే విధంగా చూడాలని కోరారు.


బీసీ రిజర్వేషన్‌కి బీజేపీ మద్దతు ఇస్తుంది..

బీసీ రిజర్వేషన్‌కి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పాయల్ శంకర్ స్పష్టం చేశారు. బీసీలకి ఉన్న అనుమానాలని ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. కామారెడ్డి డిక్లరేషన్ మీద సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పారు. మీ చేతులో ఉన్న అధికారాన్ని పంచి పెట్టడానికి మీకు ఉన్న అభ్యతరం ఏంటి..? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చక ప్రజలకి జరిగిన మేలు ఏంటి..? బీసీలలో ప్రభుత్వానికి నమ్మకస్తులు లేరా.. మీ మంత్రి వర్గం, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఎంత మంది బీసీలకి ఇచ్చారు..? అని పాయల్ శంకర్ ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి

హీరో అసభ్య ప్రవర్తన.. హీరోయిన్‌పై ట్రోలింగ్స్..

జైల్లో స్టార్ హీరో అష్టకష్టాలు.. బెడ్ షీట్ కావాలంటూ వేడుకోలు..

Updated Date - Aug 31 , 2025 | 01:02 PM