Flood Compensation: పంట నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:27 AM
వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శాసన సభలో ప్రకటన చేయాలన్నారు. లేదంటే రైతుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టాలని రేవంత్ సర్కారును మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నామని.. బడ్జెట్‌లో పెట్టారు.. కానీ దానికి బీమా చెల్లించలేదని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్లు కేవలం బీసీలకు మాత్రమే ఇవ్వాలని, ముస్లింలను ఆ జాబితా నుంచి తొలగించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
ఒకవేళ అందులోంచి 10% ముస్లింలకు ఇస్తే, మరి వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా హిందువులకు ఇస్తారా అని ప్రశ్నించారు. జీవో 49ను రద్దు చేయకపోతే బీఆర్‌ఎస్ సర్కారుకు పట్టిన గతే కాంగ్రె్‌సకు పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతికి పాల్పడ్డ వారికోసం ప్రత్యేకంగా జైలు నిర్మించాలని బీజేపీ మరో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.