Home » CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం లండన్ పర్యటనలో సీఎం ఉన్నారు. యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన.. అక్కడకు వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో 22ఏ భూముల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాయనున్నారు. ఈరోజు(గురువారం) సాయంత్రం లేఖ ద్వారా వివరణ ఇవ్వనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది.
ప్రజా ప్రభుత్వంలో మంచి, చెడు.. ఏమున్నా మాట్లాడుకొని ముందుకు వెళదామని, ఈ ప్రభుత్వం అందరిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు.
తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు.
మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు.
ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త శాఖను ఏర్పాటు చేసింది..