CM Revanth Reddy: తెలుగువాడిని గెలిపించుకుందాం!
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:46 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగువారికి దక్కిన గౌరవమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుందాం.. ఒకతాటిపైకి వచ్చి ఓటు వేద్దాం
రెండు రాష్ట్రాల 60 ఓట్లు ఆయనకే పడాలి
పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి
సుదర్శన్‌రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం
రాష్ట్రంలో కులగణన సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్‌గా సేవలందించారు
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సుదర్శన్‌రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్‌ను కలుస్తా
ఆయన నా ముఖం చూస్తాడో.. లేదో..?
సుప్రీం తేల్చకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు
మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగువారికి దక్కిన గౌరవమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది లోక్‌సభ, 18 మంది రాజ్యసభ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఆయన్ను గెలిపించాలని కోరారు. సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీతోనూ సంబంధం, అనుబంధం లేదని ప్రస్తావించారు. ఆయనకు ఏ పార్టీలోనూ సభ్యత్వమూ లేదని గుర్తు చేశారు. తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించేందుకు అందరమూ ఒకటైనట్లుగానే తెలుగువాడైన సుదర్శన్‌రెడ్డిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా అందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విజయం కోసం కృషి చేయాలంటూ టీడీపీ, బీఆర్‌ఎస్, వైసీపీ, ఎంఐఎం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, కేసీఆర్, వైఎస్ జగన్, అసదుద్దీన్ ఒవైసీ, పవన్ కళ్యాణ్‌లకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో సుదర్శన్‌రెడ్డికి మద్దతు కూడగట్టాలని వామపక్ష నేతలను కోరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజల గౌరవ ప్రతిష్ఠలను పెంచిందని చెప్పారు. దేశ రాజకీయాల్లో.. ఎన్నికల్లో నెగ్గడానికి ఎన్నికల కమిషన్‌ను దుర్వినియోగ పరిచి ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న ఎన్డీయే ఒక పక్కన ఉంటే.. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాజ్యాంగ బద్ధమైన సంస్థలను పరిరక్షించాలని చూస్తున్న ఇండియా కూటమి మరోపక్కన ఉంద ని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వారిని ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించేందుకు ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజకీయాలకు అతీతుడని, తెలంగాణ రైతు బిడ్డ, రాజ్యాంగ నిపుణుడని అన్నారు. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జడ్జిగా, ఇతర రాష్ట్రాల్లో చీఫ్ జస్టి్‌సగా సుదీర్ఘ కాలం సేవలు అందించారని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపైన ఉందని చెప్పారు.
ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
రాజ్యాంగ పరిరక్షణ కోసం న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉప రాష్ట్రపతి చేయాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల నాయకత్వాలు రాజకీయాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమి, తెలంగాణ ప్ర భుత్వం తరపున కోరుతున్నానన్నారు. తెలుగు రాష్ట్రం నుంచి పీవీ నర్సింహారావు ప్రధాని అయినప్పుడు.. నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన్ను గెలిపించేందుకు అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత ఎన్టీఆర్ ముందుకు వచ్చారని గుర్తు చేశారు. తెలుగువాడైన పీవీ ప్రధాని కావడం తెలుగువారందరికీ గర్వకారణమని చెప్పిన ఆయన.. ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని పోటీకి పెట్టలేదని చెప్పారు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్నా పీవీకి సంపూర్ణ మద్దతు పలికి ఆయన గెలుపునకు సహకరించి.. రాజకీయంగా విజ్ఞత ప్రదర్శించారని గుర్తు చేశారు. ఉప రాష్ట్రపతిగా సుదర్శన్‌రెడ్డి గెలిస్తే.. రేపటి రోజున ఆయ న రాష్ట్రపతి అయ్యేందుకూ అవకాశం ఉంటుందన్నారు. అందరూ ఏకమై ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుని.. సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ కోవిదుడైన సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతిగా ఉంటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందని, అంతిమంగా దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు.
బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి గెలిస్తే విద్య, ఉద్యోగాలు, ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్.. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్న, విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకుంటున్న ప్రధాని మోదీకి ప్రతినిఽధి అని చెప్పారు. ఎన్డీయే అభ్య ర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రక్రియ వేగంగా అమలవుతుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి బలహీన వర్గాల బలమైన గొంతుకన్నారు. రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన తర్వాత ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీకి సుదర్శన్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారని గుర్తు చేశారు. చైర్మన్‌గా ఆయన సూచన మేరకే విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాధాకృష్ణ గెలిస్తే ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని, సుదర్శన్‌రెడ్డి గెలిస్తే 42ు రిజర్వేషన్ వస్తుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశంలోని అంద రూ ఆత్మప్రభోధానుసారం ఓటేయాలని సూచన చేశా రు. ఈనెల 21న సుదర్శన్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంద చెప్పారు.
మోదీ అంటే బీఆర్‌ఎ్‌సకు భయమా?
రాష్ట్రంలోని రైతుల అవసరాల మేరకు యూ రియాను సరఫరా చేయాలంటూ లేఖలు, విజ్ఞప్తుల రూపం లో కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం పదే పదే కోరినా స్పందన లేకపోవడం దారుణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే రైతులకోసం మోదీ సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు తమతో కలిసి రావాల్సిన బీఆర్‌ఎస్ ఎంపీలు.. పార్లమెంటులో పత్తా లేరన్నారు. గల్లీలో లొల్లి చేసేందుకు ఉత్సాహం చూపేవాళ్లు.. ఢిల్లీలో మోదీని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారంటూ నిలదీశారు. రాష్ట్ర రైతాంగానికి అండగా నిలవాల్సిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు మోదీ భజనలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. నిర్లక్ష్య, వివక్ష పూరిత వైఖరిని ప్రదర్శిస్తోన్న కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఎండగట్టిన, పార్లమెంటు వేదికగా తెలంగాణ రైతుల పక్షాన నిలిచిన ప్రియాంకగాంధీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.
సుప్రీం నిర్ణయం ఆలస్యమైతే పార్టీ పరంగా రిజర్వేషన్లు
ప్రభుత్వ బిల్లులపై గవర్నర్/రాష్ట్రపతి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు పెట్టిన నేపథ్యంలో.. కోర్టు తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్సు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోర్టు తుది నిర్ణయం ఆలస్యమైతే పార్టీల పరంగా బీసీలకు 42ు టికెట్లు ఇద్దామని ప్రతిపాదించి ఎన్నికలకు వెళ్లడమే ప్రత్యామ్నాయమని చెప్పారు. ఈ నెల 23న జరిగే టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఏం చేయాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం తన నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే సుదర్శన్‌రెడ్డిని ఉప రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసిందని, ఇందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. సుదర్శన్‌రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్‌ను కలుస్తారా అన్న ప్రశ్నకు అధిష్ఠానం ఏం ఆదేశిస్తే అది చేస్తానన్నారు. ఆయనకు తన ముఖం చూడడం ఇష్టం ఉందో.. లేదోననని అనుమానం వ్యక్తం చేశారు. తాను శాంపిల్ కోసం ఏ స్కీమ్‌లూ పెట్టబోనని, పెట్టిన పథకం గ్రౌండ్ దాకా వెళ్లేలా చూస్తున్నామని చెప్పారు. అడిగిన వాళ్లందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లూ అర్హులకు ఇస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..