Telugu States CM: తెలుగు రాష్ట్రాల సీఎంల షెడ్యూల్..
ABN , Publish Date - Aug 20 , 2025 | 08:11 AM
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈరోజు బిజీబిజీగా గడుపనున్నారు. ఈ మేరకు ఇవాళ్టి సీఎంల పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు.
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటన వివరాలను అధికారులు విడుదల చేశారు. ఇవాళ(బుధవారం) మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా.. ఉదయం 10గంటలకు సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం నివాళులుర్పిస్తారు. అనంతరం 11 గంటలకు శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని TALIM వద్ద జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గండిపేట మండలం నియో పోలీస్ కోకాపేట్ వద్ద ఎగ్జిట్ రోడ్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం జన్వాడ వద్ద K కన్వెన్షన్‌లో తన సోదరుడు తిరుపతి రెడ్డి కూతురు వివాహా నిశ్చితార్థ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు షెడ్యూల్‌ను కూడా అధికారులు విడదుల చేశారు. ఇవాళ ఉదయం 10.40 నిమిషాలకు మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌కు వెళ్లనున్నారు. అనంతరం 11 గంటలకు టెక్ పార్కులోని నాలుగవ ఫ్లోరో నూతనంగా నిర్మించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 01.30 నిమిషాలకు గంటలకు సచివాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. 02.50 నిమిషాలకు నరేగాపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో గ్రామీణ ప్రజలకు పని కల్పించడంతో పాటు, గ్రామీణాభివృద్ధి అంశాలు ప్రస్తవించనున్నారు. పని దొరకడంలో జాప్యం, వేతనాలు చెల్లించడంలో జాప్యం, అవినీతి వంటి సమస్యలు నరేగా చట్టంలో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి సమీక్షలో ప్రభుత్వం చర్యలు తీసుకునొంది. 03.20 నిమిషాలకు గృహ నిర్మాణ శాఖపై భేటీ కానున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 06.30 నిమిషాలకు ఉండవల్లిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...
‘కన్ఫర్డ్’లుగా 17 మంది సిఫారసు!
విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తీసేయండి