Share News

Kokapet: నియో పోలీస్‌ లే అవుట్‌ నుంచి నేరుగా ఔటర్‌కు

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:00 AM

కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ నిర్మించిన ట్రంపెట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి రానుంది.

Kokapet: నియో పోలీస్‌ లే అవుట్‌ నుంచి నేరుగా ఔటర్‌కు

  • అందుబాటులోకి ట్రంపెట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్‌ చేంజ్‌

  • నేడు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కోకాపేట నియోపోలీస్‌ లే అవుట్‌ నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా హెచ్‌ఎండీఏ నిర్మించిన ట్రంపెట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్‌ చేంజ్‌ అందుబాటులోకి రానుంది. నియో పోలీస్‌ లే అవుట్‌ వైపు మూవీ టవర్స్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన ఎంట్రీ, ఎగ్జిట్‌ టోల్‌ప్లాజాలతో గల ట్రంపెట్‌ ఇంటర్‌ చేంజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ ఫ్లై ఓవర్‌ పనులు ఇటీవల హెచ్‌ఎండీఏ పూర్తి చేసింది. నియోపోలీస్‌ లే అవుట్‌లో నివాసముండే వారికి మెరుగైన రవాణా సౌకర్యంలో భాగంగా ట్రంపెట్‌ ఫ్లై ఓవర్‌ను రూ.65 కోట్లతో నిర్మించారు. 1.27 కి.మీ పొడవుతో నాలుగు వరుసలతో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశారు. ఈ ఫ్లై ఓవర్‌పై వెళ్లే వాహనదారులు టోల్‌ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.


భద్రాద్రి జిల్లాలో రేపటి సీఎం పర్యటన వాయిదా

చండ్రుగొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన వాయిదా పడింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి గురువారం ఆయన హాజరుకావాల్సి ఉండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్న కారణంగా భద్రాద్రి జిల్లా పర్యటన వాయిదా పడినట్టు సభా వేదిక ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మువ్వా విజయబాబు తెలిపారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన కూడా విడుదలైంది. తదుపరి ముఖ్యమంత్రి పర్యటన ఉండే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా, దశాబ్దాలుగా తాము ఎదురు చూస్తున్న సొంతింటి కల నెరవేరబోతోందని కొండంత ఆశతో ఉన్న బెండాలపాడు గ్రామంలోని ఆదివాసీలు సీఎం పర్యటన రద్దుతో నిరాశకు గురయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 20 , 2025 | 04:00 AM