Share News

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:07 AM

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం న్యూఢిల్లీ వెళుతున్నారు.

CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకే

హైదరాబాద్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గురువారం న్యూఢిల్లీ వెళుతున్నారు. శుక్రవారం కూడా ఢిల్లీలోనే ఉంటున్న సీఎం.. ఓ మీడియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటనల భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశముంది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం సీఎం రేవంత్‌ తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటారు.

Updated Date - Aug 21 , 2025 | 04:07 AM