Home » CM Chandrababu Naidu
రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి/పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. హైబ్రిడ్ పద్ధతిలో చేపట్టే ఈ పనులకు 19 ఏళ్ల వ్యవధిలో రూ.22,826 కోట్లు ఖర్చుకానుంది....
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు ఈ రోజు అని తెలిపారు. పిల్లలకు అర్ధం అయ్యేలా బాలల భారత రాజ్యాంగాన్ని పుస్తకరూపంలో తీసుకొచ్చామని వెల్లడించారు.
ఈరోజు జాతీయ రాజ్యాంగ దినోత్సవమని.. అందరికీ బాధ్యత రావాలని, చైతన్యం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాజ్యాంగంలోని 15వ పేజీలో పిల్లల గురించి వివరించారని పేర్కొన్నారు.
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
నేపాల్‌తో జరిగిన ఫైనల్స్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.