Home » CM Chandrababu Naidu
ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ నిజమైన కర్మయోగిగా చూస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు పవన్ కల్యాణ్.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్' బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి గర్భాలయ శిఖరాన్ని దర్శించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం నిర్వహించి, అమ్మవారికి కుంకుమార్చన చేశారు.
ప్రధాన మంత్రి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూలవిరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, మల్లెపూల అర్చన, మహామంగళ హారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
కర్నూల్లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్కు విశాఖ వేదిక కావడం గొప్ప విషయమని.. అమెరికా తర్వాత ఏపీకే ఈ డేటా సెంటర్ రాబోతుందని మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. సముద్ర గర్భం ద్వారా కేబుల్ వేసి, ప్రపంచం మొత్తం లింక్ చేయబోతున్నారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేద్దామన్నారు సీఎం. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు.