AP Assembly 2026 Calendar: సరికొత్త థీమ్‌తో 2026 క్యాలెండర్... సీఎం చంద్రబాబు ప్రశంసలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:07 PM
ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం డిజైన్ చేయించింది.
అమరావతి, డిసెంబర్ 23: ఏపీ అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (మంగళవారం) ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో 2026 క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్, డైరీలను సీఎం ఆవిష్కరించారు. జీవ వైవిద్యం - ఆంధ్రప్రదేశ్ సజీవ వారసత్వం అనే థీమ్‌తో క్యాలెండర్‌ను అసెంబ్లీ సెక్రటేరియట్ రూపొందించింది. ఏపీలోని ప్రకృతి సంపద, కళలు, సంప్రదాయాలు, ఆధునిక సాంకేతికతలకు అద్దం పట్టేలా కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను రూపొందించారు.
ఏపీలో ఉన్న వివిధ వన్యప్రాణుల గురించి అవగాహన కల్పించేలా నూతన సంవత్సర క్యాలెండర్ రూపకల్పన జరిగింది. సాంప్రదాయ కలంకారీ కళాశైలిలో క్యాలెండర్లోని చిత్రాలు వచ్చేలా శాసన సచివాలయం డిజైన్ చేయించింది. ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య వారసత్వాన్ని, సీఎం ఆలోచనలను చాటిచెప్పేలా 2026 క్యాలెండర్ ఆవిష్కృతమైంది.
సీఎం ప్రశంసలు...
2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్‌ను చక్కగా డిజైన్ చేశారని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలనే మంచి సందేశంతో క్యాలెండర్ ఉందని ప్రశంసించారు. క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, శాసన సభా వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
పీపీపీ విధానం లక్ష్యం అదే: మంత్రి సత్యకుమార్
మంత్రి కుమారుడిపై లైంగిక ఆరోపణలు కేసు.. అసలు నిజం ఇదీ
Read Latest AP News And Telugu News