Home » Chittoor
తక్కువ ధరకే మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపు యజమానిపై దాడికి దిగాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ దాడి ఒకరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.
మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. వినుత , ఆమె భర్త ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రూ. 30 లక్షలు ఇస్తామన్నారని రాయుడు వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అరెస్ట్ చేసిన వారిలో పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ జిల్లా సెక్రటరీ యర్రబల్లి శ్రీను, చెన్నైకి చెందిన శరవణ ఉన్నారు. అలాగే.. పుంగనూరు మండలం బండపల్లెకు చెందిన శ్రీనివాస్, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, తవనంపల్లె మండలం పట్నంకు చెందిన రమేష్, జేసిజి డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.
వైసీపీకి ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినా కూడా వారిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇంకా, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
పుంగనూరు నియోజకవర్గం, పులిచర్ల మండలం నుంచి యల్లంపల్లికి గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఇవాళ(శనివారం) దేవలం పేటలో పర్యటించనున్నారు. అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను పరిశీలించనున్నారు.
ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు సమీప మండలాల్లో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని నీవా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం జరగని కౌన్సెలింగ్‌తో గంటలకొద్దీ నిరీక్షిస్తూ కొత్త టీచర్లు ఇబ్బంది పడ్డారు. ఇందులో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది.