Home » Chief Minister
బాలకృష్ణుడు చిన్నతనంలో వెన్నంటే ఎంతో ఇష్టపడే వాడని, అందుకే ఆయనను అంతా వెన్నదొంగగా ముద్దుగా పిలుచుకునే వారని చెప్పారు. కృష్ణుడు మఖాన్‌చోర్ అయితే మోదీ 'మన్ కీ చోర్' అని పోలిక తెచ్చారు.
ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేసి ముఖ్యమంత్రి ట్రాలీని పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.
రాహుల్ గాంధీ వివాదాస్పద 'ఓట్ చోరీ' ఆరోపణలను పుణేలో శనివారంనాడు జరిగిన పార్టీ సమావేశంలో రాజ్‌ఠాక్రే సమర్ధించారు. ఎన్నికల్లో అవకతవకలు కొత్త అంశమేమీ కాదని, 2016-17లో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయని అన్నారు.
కేంద్ర రాష్ట్ర సంబంధాలపై తొలి జాతీయ సదస్సును తమిళనాడులో తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని స్టాలిన్ అన్నారు కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా జీఎస్‌టీ ఆదాయం అందిస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చెప్పారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, పట్టుబడిన ఇద్దరిలో ఒక వ్యక్తి గాంధీనగర్‌లోని ట్రేడర్లతో గొడవపడ్డాడు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోనికి తీసుకున్నారు.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
ఫడ్నవిస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రజాజీవితం, సాధించిన విజయాలపై 'మహారాష్ట్ర నాయక్' అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకంలో శరద్ పవార్ ఒక ఆర్టికల్ కూడా రాశారు.
ఫడ్నవిస్ ఆఫర్ ఇచ్చిన కొద్దిసేపటికి ఫడ్నవిస్, థాకరే నవ్వుతూ కరచాలనం చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అది శాసనమండలి సమావేశం కావడానికి ముందు ఈ ఇద్దరు నేతలు కలుసుకున్న ఫోటో కావడం విశేషం.
అమరవీరుల మెమోరియల్‌కు వెళ్లకుండా తనను, తన మంత్రివర్గ సహచరులను పోలీసులు అడ్డుకున్న షాకింగ్ విజువల్స్‌పై ఒమర్ మాట్లాడుతూ, తమకు ఏమి జరిగిందనేది ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యం గురించి జమ్మూకశ్మీర్ ప్రజలకు వాళ్లు ఇచ్చిన సందేశం ఏమిటనేదే ఇక్కడ ముఖ్యమని అన్నారు.