Devendra Fadnavis: అర్బన్ మావోయిస్టులా మాట్లాడుతున్న రాహుల్
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:54 PM
జన్ జెడ్‌ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుతున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు.
ముంబై: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత అర్బన్ మావోయిస్టులా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 'జన్ జెడ్'ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ గురువారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక ట్వీట్ చేసారు. దేశంలోని యువత, విద్యార్థులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ఓటు చోరీని అడ్డుకోవాలని కోరారు. ఈ పోరాటంలో తాను వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు.
దీనిపై ఫడ్నవిస్ స్పందిస్తూ, జన్ జెడ్‌ను రెచ్చగొట్టి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయాలని రాహుల్ కోరుకుంటున్నారని, ఇది ఓటు చోరీ కాదని, ఆయన మెదడును ఎవరో చోరీ చేశారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల నమ్మకం లేని అర్బన్ మావోయిస్టుల తరహాలో ఆయన మాట్లాడుతున్నారని, రాహుల్ అనుచరులు కూడా అర్బన్ మావోయిస్ట్ భావజాలంతోనే మాట్లాడుతున్నారని ఆరోపించారు. అయితే ఇండియాలోని 'జన్ జెడ్'కు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నాయని, స్టార్టప్, టెక్నాలజీ రివల్యూషన్‌ను లీడ్ చేస్తున్నారని చెప్పారు. రాహల్ గాంధీకి యువతపై కానీ, దేశంలోని సీనియర్లపై కానీ ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
డీయూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయభేరి
హఫీజ్‌ను కలిసినందుకు మన్మోహన్ కృతజ్ఞతలు.. అఫిడవిట్‌లో యాసిన్ మాలిక్ వెల్లడి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి