Share News

Bhagwant Mann Hospitalised: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి

ABN , Publish Date - Sep 05 , 2025 | 09:17 PM

భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.

Bhagwant Mann Hospitalised: ఆసుపత్రిలో చేరిన పంజాబ్ ముఖ్యమంత్రి
Bhagwant Mann

మెుహాలి: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) అస్వస్థతకు గురయ్యారు. మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో శుక్రవారంనాడు చేరారు. గత రెండ్రోజులుగా ఆయన జర్వం, పొత్తకడుపు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు.

కాగా, మాన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ఆయన సన్నిహత వర్గాలు తెలిపాయి. అయితే మాన్ ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎప్పుడు డిశ్చార్చ్ కావచ్చనే విషయంపై సీఎం కార్యాలయం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

భగవంత్ మాన్ రెండ్రోజుల క్రితం వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వేకు బదులుగా ఆయన కాలినడకన ఆ ప్రాంతాల్లో పర్యటించారు.

ఇవి కూడా చదవండి..

యూఎస్ దెబ్బ.. ఎగుమతిదారులకు అండగా త్వరలో కేంద్ర ప్యాకేజీ

రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..

For More National News And Telugu News

Updated Date - Sep 05 , 2025 | 09:17 PM