Nirmala Sitaraman: యూఎస్ దెబ్బ.. ఎగుమతిదారులకు అండగా త్వరలో కేంద్ర ప్యాకేజీ
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:33 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై 25 శాతం విధించిన సుంకానికి అదనంగా ఇటీవల మరో 25 శాతం డ్యూటీ విధించారు. అది ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. దుస్తులు, ఆభరణలు, పాదరక్షల నుంచి కెమికల్స్ వరకూ 50 శాతం సుంకాలను భారత్ ఎదుర్కొంటోంది.
న్యూఢిల్లీ: అమెరికా ఇబ్బడిముబ్బడిగా విధించిన సుంకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతుదారులను (Exporters) ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) భరోసా ఇచ్చారు. ఎగుమతిదారులకు ఉపశమనం కల్గించేందుకు త్వరలోనే ఒక ప్యాకేజీ (Package)ని ప్రకటిస్తామని శుక్రవారంనాడు తెలిపారు. ఆగస్టు 27 నుంచి అమెరికా అమలు చేస్తున్న 50 శాతం సుంకాల ప్రభావం పడిన పరిశ్రమలకు కేంద్ర ప్యాకేజీ సహాయకారిగా ఉంటుందని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వస్తువులపై 25 శాతం విధించిన సుంకానికి అదనంగా ఇటీవల మరో 25 శాతం డ్యూటీ విధించారు. అది ప్రస్తుతం అమల్లోకి వచ్చింది. దుస్తులు, ఆభరణలు, పాదరక్షల నుంచి కెమికల్స్ వరకూ 50 శాతం సుంకాలను భారత్ ఎదుర్కొంటోంది.
క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం..
క్లిష్ట పరిస్థితుల్లో ఎగుమతిదారులను విడిచిపెట్టేది లేదని, వారిని ఆదుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 'పరిశ్రమలు తమ సమస్యలను వివరించాయి. దీనిపై ప్రభుత్వం ఒక ఆలోచనతో ఉంది. 50 శాతం టారిఫ్ ఎదుర్కొంటున్న కంపెనీలకు త్వరలోనే దీనిని వర్తింపజేస్తాం' అని చెప్పారు. ప్రతిపాదిత ప్లాన్‌కు మంత్రివర్గ ఆమోదం అవసరమని చెప్పారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుపై..
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంటుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాలకు అనుగుణంగానే భారత్ ఇంధన ఎంపికలు ఉంటాయన్నారు. మన అవసరాలకు తగినది కొనడం, ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే దానిని నిర్ణయం తీసుకోవాల్సింది మనమేనని చెప్పారు. 'రష్యా నుంచి కావచ్చు మరోచోట నుంచి కావచ్చు. రేట్లు, లాజిస్టిక్స్ వంటి మన అవసరాలకు అనుగుణంగానే కొనుగోళ్లు ఉంటాయి. మనకు ఏది ప్రయోజనకారిగా ఉంటుందో అదే చేస్తాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి తీరుతాం' అని మంత్రి వివరించారు.
టారిఫ్‌లతో ఎదురవుతున్న లిక్విడిటీ సవాళ్లను పరిష్కరించేందుకు 'సమగ్ర ఎగుమతి మద్దతు వ్యూహాన్ని' కేంద్రం ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ సమయంలో తీసుకున్న లిక్విడిటీ రిలీఫ్ చర్యల తరహాలోనే మార్కెట్ డైవర్సిఫికేషన్, సప్లయ్ చైన్ ఇంటిగ్రేషన్ కోసం మధ్యతరహా, దీర్ఘకాలిక వ్యూహాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి
రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..
For More National News And Telugu News