CDS Anil Chauhan: చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:20 PM
భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్‌లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదమే భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్ (Anil Chauhan) అన్నారు. పాకిస్థాన్ (Pakistan) సాగిస్తున్న పరోక్ష యుద్ధం (Proxy War) రెండవ ప్రధాన సవాలుగా అభివర్ణించారు. ఒక దేశం ముందుండే సవాళ్లు క్షణికమైనవి కావని, వివిధ రూపాల్లో ఉంటాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీడీఎస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'చైనాతో సరిహద్దు వివాదం భారతదేశానికి అతిపెద్ద సవాలని నేను భావిస్తున్నాను. అది అలాగే కొనసాగుతుంది. భారత్‌పై పాక్ సాగిస్తున్న పరోక్ష యుద్ధం రెండో ప్రధాన సవాలు' అని సీడీఎస్ అన్నారు. ప్రాంతీయ అస్థిరత కూడా ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని అన్నారు. వార్ డొమైన్స్‌లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.
అణ్వాయుధ శక్తులు
'మన ప్రత్యర్థులు ఇద్దరూ అణుశక్తి దేశాలు. వారిపై మనం ఏ తరహా ఆపరేషన్లు జరపాలో నిర్ణయించుకోవడం ఎల్లప్పుడూ ఒక సవాలుగానే ఉంటుంది' అని సీడీఎస్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో ప్రణాళికలు వేయడం, లక్ష్యాలను ఎంచుకునే విషయంలో సాయుధ బలగాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం ఆపరేషన్ సిందూర్ ఉద్దేశం కాదని, దేశ సహనానికి ఎరుపుగీత గీయడమని అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనేది సైబర్ వార్‌ఫేర్‌తో సహా మల్డీ డొమైన్ ఆపరేషన్ అని, మిలటరీ విభాగాల మధ్య సమన్వయం చేసుకోవడం, జాయింట్ మొబిలైజేషన్ దీనిలో కీలకమైన అంశమని వివరించారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతికి జిన్‌పింగ్ లేఖపై ఎంఈఏ స్పందనిదే..
34 వాహనాల్లో మానవబాంబులు.. బెదిరింపు మెసేజ్‌తో హైఅలర్ట్
For More National News And Telugu News