Rekha Gupta Praise PM Modi: ఓట్లు కాదు, హృదయాలను దొంగిలించారు.. మోదీపై సీఎం ప్రశంసలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 09:07 PM
బాలకృష్ణుడు చిన్నతనంలో వెన్నంటే ఎంతో ఇష్టపడే వాడని, అందుకే ఆయనను అంతా వెన్నదొంగగా ముద్దుగా పిలుచుకునే వారని చెప్పారు. కృష్ణుడు మఖాన్‌చోర్ అయితే మోదీ 'మన్ కీ చోర్' అని పోలిక తెచ్చారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP)పై విపక్షాల 'ఓట్ చోరీ' అరోపణలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) బలంగా తిప్పికొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 'హృదయాలను దోచుకున్నారు, ఓట్లను కాదు' అని అన్నారు. అంతర్జాతీయ ఖ్యాతిని మోదీ ఆర్జించారని ప్రశంసలు కురిపించారు. మంగళవారంనాడు ఢిల్లీలోని ఒక మాల్‌లో జరిగి విశ్వపరిక్రమ పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, బాలకృష్ణుడు చిన్నతనంలో వెన్నంటే ఎంతో ఇష్టపడే వాడని, అందుకే ఆయనను అంతా వెన్నదొంగగా ముద్దుగా పిలుచుకునే వారని చెప్పారు. కృష్ణుడు మఖాన్‌చోర్ అయితే మోదీ 'మన్ కీ చోర్' అని పోలిక తెచ్చారు. ఓట్లు చోరీ చేయాల్సిన అవసరం మోదీకి లేదన్నారు. అధికారం కోల్పోయి, ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనేందుకు భయపడుతున్న పార్టీలే మోదీపై ఆరోపణలకు దిగుతున్నాయని ఎద్దేవా చేశారు.
దేశానికి కొత్త శక్తిని నింపిన ప్రధాని
ప్రధానమంత్రి మోదీ తన నాయకత్వం ద్వారా దేశానికి కొత్త శక్తిని నింపారని, అమెరికా వంటి దేశాలు కూడా భారత్‌కు సెల్యూట్ చేస్తున్నాయని రేఖా గుప్తా అన్నారు. ప్రధాని ఒక ముని (Saint) అని, తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేశారని, తన కుటుంబానికి ఏనాడూ లబ్ధి చేకూర్చలేదని చెప్పారు. ఆయన (రాహుల్) తన బావమరిదికి భూములిచ్చారని, సోదరికి పోస్ట్ ఇచ్చారని, తల్లిని ప్రధాని అభ్యర్థిని చేశారని, అయితే ఆయన ఏమి చేస్తున్నారో మాత్రం ఎవరికీ అర్థం కాదని అన్నారు. దేశ పురోభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రధానిని నిందిస్తున్నారని తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
మోదీ పుట్టినరోజున బిహార్‌లో చలో జీతే హై చిత్ర ప్రదర్శన
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి