Home » Chennai News
శరీరంపై పచ్చబొట్టు (టాటూ) ఉండడంతో సైన్యంలో చేరేందుకు నిరాకరించబడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మదురై తత్తనేరి అరుళ్దాస్పురం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ కుమారుడు యోగసుధీష్ మదురైలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్‌న జరిగింది.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీవీకే నేత, హీరో విజయ్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉంటారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా సాత్తూరు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో రూ.50లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు ఆయన శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు వీధి కుక్కల బారిన పడుతున్నారు. కుక్క కాటుకు సరైన వైద్యం పొందక రేబిస్‌తో మృతిచెందిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా, కుక్కలు ప్రజలపై దాడిచేయడం మాత్రం కొనసాగుతూనే ఉంది.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్ కటకటాలపాలయ్యాడు. తిరుచ్చి కేకే నగర్‌కు చెందిన తమిళ్ (52) తిరుచ్చిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.
రాష్ట్రంలో కూడా ఓటరు జాబితా సంస్కరణ చేపట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌లో శుక్రవారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రధాన మంత్రి మార్గదర్శకాలతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీని తగ్గించి, ఆర్ధిక విప్లవాన్ని అమలుచేశారన్నారు.
ఆయుధపూజ, దీపావళిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06151 చెన్నై సెంట్రల్-కన్నియాకుమారి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 22,29, అక్టోబరు 6,13,20 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.50కు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.
తమిళ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నివాసంలో గుర్తు తెలియని అగంతకుడు చొరబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన ‘వై’ కేటగిరీ భద్రత కలిగిన విజయ్ నివాసంలో ఆ అగంతకుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తిరునల్వేలిలో బుధవారం రాత్రి మద్యం మత్తులో బైకుపై వెళుతున్న యువకుడిని కారుతో ఢీకొట్టిన ట్రాఫిక్ విభాగం ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు పడింది. తూత్తుకుడి జిల్లా కయిత్తారుకు చెంందిన గాంధీరాజన్ (59) తిరునల్వేలిలో ట్రాఫిక్ విభాగం ఎస్‌గా పనిచేస్తున్నారు.