Heavy Rains: 17, 18 తేదీల్లో భారీ వర్షాలు..
ABN , Publish Date - Oct 16 , 2025 | 11:52 AM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
- నేడు రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు
- చెన్నై నుంచి కుమరి వరకూ భారీ వర్షాలు
చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో చెన్నై(Chennai) నుండి కన్నియాకుమారి వరకు ఈ నెల 17 నుండి 18వరకు భారీగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు గురువారం ప్రవేశించే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ స్థాయి 44 సెం.మీ అధిగమించి, 50 సెం.మీల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ఆగమనం, ఈ నెల 18 లేదా 19న బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది, ఉత్తరాది జిల్లాలతో పాటు తీరప్రాంత జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా, ఇతర ప్రాంతాల్లో చెదురుమదురుగాను వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పరకటించింది.. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం(Kanchipuram) జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కన్నియాకుమారి జిల్లాలో సముద్రతీర ప్రాంతాల్లో అలలు ఉదృతంగా ఉంటాయని,

పెనుగాలులు బలంగా వీస్తాయని, జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో లక్షదీవుల సమీపంలో ఈ నెల 18 లేదా 19న అల్ప పీడనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో సముద్రతీర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా వుండగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు తదితర జిల్లాల్లో బుధవారం వేకువజాము నుంచి సుమారు మూడు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవాల్సివచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News