Diwali: దీపావళి ఎఫెక్ట్... ఒక్కరాత్రే ఆ నగరంలో రూ.7 కోట్ల వస్త్ర వ్యాపారం
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:50 PM
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈరోడ్ వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు.
చెన్నై: దీపావళి(Diwali) పండుగను పురస్కరించుకుని ఈరోడ్(Eeroad) వారాంతపు సంతలో రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగింది. ఈ జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం రాత్రి వారాంతపు వస్త్ర సంత నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ సంతకు పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Kerala, Karnataka, Andhrapradesh) తదితర రాష్ట్రాల నుంచి వస్త్ర వ్యాపారులు వచ్చి తమకు కావాల్సిన దుస్తులను భారీ మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు.

ఆ ప్రకారంగా సోమవారం రాత్రి జరిగిన ఈ సంతంలో ఏకంగా రూ.7 కోట్ల మేర వస్త్ర వ్యాపారం జరిగిందని స్థానిక వ్యాపారులు వెల్లడించారు. దీపావళి పండుగకు మరో ఐదు రోజులే ఉన్న నేపథ్యంలో ఈ వారంతపు సంతకు కొనుగోలుదారులు పోటెత్తారు. ఒక్క రోజే హోల్‌సేల్ వ్యాపారం 50 శాతం, చిల్లర వ్యాపారంగా 60 శాతం మేరకు జరిగినట్టు వ్యాపారులు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News