Share News

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:27 AM

తమిళనాడు దిండుగల్‌ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్‌ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్‌ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు.

Chennai News: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని చంపేశారు..

చెన్నై: దిండుగల్‌ జిల్లా నిలకోట సమీపంలోవున్న రామనాయకన్‌పట్టిలో కులాంతర వివాహం చేసుకున్న రామచంద్రన్‌ (24) అనే యువకుడు దారుణహత్యకు గురైన నేపథ్యంలో, పోలీసులు పరువుహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రామచంద్రన్‌ పాడిపశువులు పెంచుతూ ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ, తమ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో గణపతిపట్టికి చెందిన చంద్రన్‌ కుమార్తె ఆర్తి (21)తో రామచంద్రన్‌(Ramachandran)కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.


కరూర్‌లో ని ఓ కళాశాలలో చదువుతున్న ఆర్తి, రామచంద్రన్‌ వేర్వేరు కులాల వారు కావడంతో వారి ప్రేమను యువతి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఆందోళనకు గురైన ప్రేమజంట మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితుల సహకారంతో వివాహం చేసుకున్నారు. అనంతరం రామనాయకన్‌పట్టిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అయితే వధూవరుల కుటుంబాల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు ఘర్షణకు దారితీశాయి.


city7.jpg

ఈ నేపథ్యంలో, ఆదివారం సాయంత్రం ఇంటినుంచి బైక్‌లో బయలుదేరిన రామచంద్రన్‌ అయ్యంపాళయం ప్రాంతంలో వంతెన పైకి చేరుకున్న సమయంలో అక్కడ మాటువేసి ఉన్న ఆర్తి తండ్రి చంద్రన్‌ మరో ఇద్దరితో కలిసి వేటకొడవళ్లతో దాడి చేయడంతో రామచంద్రన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. దుర్ఘటనపై స్థానికులు అందజేసిన సమాచారంతో నిలకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రామచంద్రన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం ఆర్తి తండ్రి చంద్రన్‌ను అరెస్ట్‌ చేసి పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 11:49 AM