Home » Central Govt
8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ప్రధాని మోదీ ఇవాళ(శుక్రవారం) ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
జేపీ నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని తుమ్మల నాగేశ్వరరావు హితవు పలికారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నంలో డాటా సిటీ ఏర్పాటుకు మద్దతునిచ్చే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆన్లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బహిరంగ లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు. వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుంది అంటూ ప్రాపగాండ చేస్తుందని విమర్శించారు.
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మంగళవారం కలిశారు. కాంగ్రెస్ ఎంపీల ఫోరమ్ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రి జేపీ నడ్డాను ఎంపీలు కలిశారు. ఈ వారంలో 62 వేల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఓ విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగింది. హైదరాబాద్ - తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలెట్ సాంకేతిక లోపం గుర్తించారు.