Home » Businesss
మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్-2026ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి బడ్జెట్‌లో దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం..
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చుట్టూ ముసురుకున్న రూ.40 వేల కోట్ల భారీ కుంభకోణం కేసులో ED కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి కంపెనీ మాజీ డైరెక్టర్ పునీత్ గార్గ్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుంది.
పనామా దేశపు సుప్రీం కోర్టు నిన్న రాత్రి ఒక సంచలన తీర్పిచ్చింది. ఈ జడ్జిమెంట్ ఏకంగా భారత రూపాయల్లో రెండు లక్షల 11 వేల కోట్ల మేర ప్రభావితమయ్యే తీర్పుగా చెబుతున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ వాణిజ్య రంగంలో ఇది పెద్ద చర్చకు దారి తీస్తోంది.
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కాంట్రాక్టు ధర శుక్రవారం రూ.67,891 లేదా 16.97 శాతం తగ్గి రూ.3,32,002కు జారుకుంది.
బంగారం, వెండి ఆభరణాలను దుకాణదారులు పింక్ పేపర్‌లోనే చుట్టి ఇస్తారు. అయితే ఆభరణాలను ఈ కలర్ పేపర్‌లోనే ఎందుకు ఇస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వల్ల డిమాండ్ పెరగడం, అమెరికా-యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణ ఆందోళనలు వంటి కారణాలు బంగారం ధరల్ని అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెట్టిస్తున్నాయి.
కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకురాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ విలువ సుమారు రూ. 90,000 కోట్లు ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.
పీఎఫ్ ఖాతాదారులకు గొప్ప శుభవార్త. ఈపీఎఫ్‌వో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు సిద్దమవుతోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి..
దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు ఐఎంపీఎస్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. దిగ్గజ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5లక్షల లోపు లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే.. ఇప్పుడు రూ.25వేలు దాటితే ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రారంభించిన 3GB రోజువారీ డేటా ప్రమోషనల్ ఆఫర్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.