Shares: ఇంట్లో మూలన దొరికిన పేపర్.. ఇప్పుడు దాని విలువ దాదాపు రెండు కోట్లు
ABN , Publish Date - Oct 07 , 2025 | 08:47 PM
ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. అప్పట్లో వెయ్యిరూపాయలతో కొన్న ఆ షేర్లు ఇప్పుడు..
ఇంటర్నెట్ డెస్క్: ముందు చూపున్న ఒక పెద్ద మనిషి చేసిన పని ఇప్పుడు ఆ ఇంటికి బంగారు గని దొరికినంత పనైంది. పాత కాగితాలు తీసి చూస్తుండగా ఒక కాగితం ఇంట్లో వాళ్ల కంటపడింది. అదేంటని తరచి చూస్తే, అవి షేర్ల పేపరు. ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం అంతా పేపర్ల రూపంలోనే ఈ స్టాక్ మార్కెట్ షేర్ల లావాదేవీలు జరిగేవి. ఆ క్రమంలోనే సదరు పెద్దమనిషి 1995లో JVSL కంపెనీ షేరు రూ. 10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేశాడు. కొన్న షేర్లకు సంబంధించిన పేపర్లను ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాడు.
దీనికోసం ఆయన పెట్టిన పెట్టుబడి అక్షరాలా వెయ్యి రూపాయలు. ఇప్పుడా షేర్ల విలువ ఏకంగా దాదాపు రెండు కోట్ల రూపాయలు అయి కూర్చొన్నాయి. వివరాల్లోకి వెళ్తే. సదరు పెద్ద మనిషి 1995 లో జిందాల్ విజయనగర స్టీల్ లిమిటెడ్ లో రూ. 10 చొప్పున 100 షేర్లు కొన్నాడు. ఈ రోజు ఆ షేర్ల విలువ రూ. 1.83 కోట్లు అయింది.
వాటి విలువ ఎలా పెరిగిందన్న విషయానికొస్తే, 2005 లో జేవీఎస్ఎల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనం అయింది. అప్పుడు జేవీఎస్ఎల్ లో 1 షేరు ఉన్న వారికి 16 జేఎస్‌డబ్ల్యూ షేర్లను ఇచ్చారు. సదరు వ్యక్తి 100 షేర్లు కొన్నాడు కావున అతనికి 1600 షేర్లు వచ్చాయి.
ఇక, ఆ తర్వాత జేఎస్‌డబ్ల్యూ సంస్థ 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టింది. దీంతో 1600 షేర్లు కాస్త 16000 షేర్లుగా మారాయి. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ (JSW) షేరు ధర రూ. 1146 వద్ద ఉంది. ఈ విలువ ప్రకారం 16000 షేర్ల విలువ రూ. 1.83 కోట్లకు పైగా అవుతుంది.
ఇది అంచనా మాత్రమే. డివిడెండ్ సైతం కలిపితే ఇంకా ఎక్కువ లాభమే వస్తుంది. ఈ వింత సంఘటనను గ్రోమాటిక్స్ మార్కెటింగ్ సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఈ అద్భుతం వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News