-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy today latest news across world 22nd october 2025 vreddy
-
BREAKING: దుబాయ్‌లో పలు సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ
ABN , First Publish Date - Oct 22 , 2025 | 06:23 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 22, 2025 20:09 IST
దుబాయ్‌లో పలు సంస్థలతో సీఎం చంద్రబాబు భేటీ
వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
షరాఫ్ సంస్థ వ్యవస్థాపకుడు షరాఫ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీలో లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూప్‌ను ఆహ్వానించిన సీఎం
-
Oct 22, 2025 15:20 IST
కడప సెంట్రల్ జైలుకు NIA అధికారులు
రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాది భార్యను కస్టడీకి తీసుకున్న NIA
జులై 1న రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు.. అబూబకర్, సిద్ధికి మహమ్మద్ అలీని అరెస్టు చేసిన తమిళనాడు IB అధికారులు
గతంలో ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి కడప జైలుకు తరలింపు
కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న.. ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీం
అబూబకర్ సిద్ధికి భార్య సైరాబాను కస్టడీకి తీసుకున్న NIA అధికారులు
పీటీ వారెంట్‌పై సైరా బానును వారం రోజులు ప్రశ్నించనున్న NIA సైరాబానును విజయవాడకు తీసుకెళ్లిన NIA అధికారులు
-
Oct 22, 2025 12:56 IST
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ED దర్యాప్తు ముమ్మరం
చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులు...
డాక్టర్ నమ్రత, కళ్యాణి, సంతోషి, నందినిని ప్రశ్నిస్తున్న ED
నమ్రత కుమారుడు జయంతి కృష్ణను విచారిస్తున్న అధికారులు
పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ED
గతంలో సృష్టి ఫెర్టిలిటీకి సంబంధించి 9 ప్రాంతాల్లో ED సోదాలు
-
Oct 22, 2025 12:55 IST
ఆస్ట్రేలియాలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కీలక భేటీ
ఆరికా సీఈఓ సంజీవ్ గాంధీతో మంత్రి శ్రీధర్‌బాబు సమావేశం
తెలంగాణలో విస్తరణ అవకాశాలపై సమావేశంలో చర్చలు
తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలను వివరించిన మంత్రి శ్రీధర్‌బాబు
ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగస్వామ్యంపై చర్చ
తెలంగాణతో భాగస్వామ్యం కొనసాగిస్తామని ఆరికా ప్రతినిధుల భరో
-
Oct 22, 2025 11:41 IST
ఎన్టీఆర్: ఎ.కొండూరు మండలంలో వైసీపీ నేత ఇసుక అక్రమ దందా
తిరువూరు నియోజకవర్గ నేతలతో కలిసి వైసీపీ నేత అక్రమంగా ఇసుక దోపిడీ
ఏపీ నుంచి తెలంగాణకు గత 2 నెలలుగా ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరలింపు
ట్రాక్టర్ ఇసుక రూ.7వేలకు విక్రయం
తిరూవురు నియోజకవర్గ వైసీపీ నేతకు ట్రాక్టర్‌కు రూ.1000 కమీషన్
వైసీపీ నేతకు అండగా నిలిచిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
వైసీపీ నేతను విడిచిపెట్టాలని తిరువూరు పోలీసులపై దేవినేని అవినాష్ ఒత్తిడి
-
Oct 22, 2025 11:13 IST
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
ఎన్టీఆర్, కృష్ణాపురం జలాశయాలకు పెరిగిన వరద నీరు
దేవళంపేట వద్ద రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు
కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు
ఎడతెరిపిలేని వర్షాలకు దెబ్బతిన్న కూరగాయ, ఉద్యాన పంటలు
-
Oct 22, 2025 10:36 IST
హైదరాబాద్: కేసీఆర్ ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్‌రావు
ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో ఇరువురు నేతలు సమావేశం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, రోడ్ షోలు, ప్రచార వ్యూహంపై చర్చ
ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం
-
Oct 22, 2025 10:35 IST
ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యం
పలు ప్రాంతాల్లో అధికంగా వాయు కాలుష్యం నమోదు
ఢిల్లీలో వాయుకాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం చర్యలు
-
Oct 22, 2025 10:17 IST
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
అమిత్ షాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే విషెస్
దేశ అంతర్గత వ్యవస్థ బలోపేతానికి అమిత్ షా కృషి ప్రశంసనీయం: మోదీ
-
Oct 22, 2025 09:57 IST
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌కు సమస్య
కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండింగ్ తర్వాత...
ఓ వైపునకు కూరుకుపోయిన హెలికాప్టర్
-
Oct 22, 2025 09:50 IST
కర్నూలు: మంత్రాలయానికి కర్ణాటక సీఎం డీకే శివకుమార్
మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న డీకే శివకుమార్
-
Oct 22, 2025 09:50 IST
అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
అమిత్ షాకు బర్త్‌డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
-
Oct 22, 2025 09:49 IST
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్
ప్రధాని మోదీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
భారత్, అమెరికా ఐక్యంగా నిలబడాలి: ప్రధాని మోదీ
-
Oct 22, 2025 09:49 IST
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై BRS అధినేత కేసీఆర్ ఫోకస్
BRS ముఖ్యనేతలు, జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇంచార్జ్‌లకు కేసీఆర్ పిలుపు
రేపు ఫాంహౌస్‌లో పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
ఉపఎన్నిక ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
ఇప్పటికే 40మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన BRS
జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనటంపై సందిగ్ధత
సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవటమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు
-
Oct 22, 2025 09:48 IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
స్వామివారిని దర్శించుకున్న ఆర్కే రోజా, నటి రవళి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్
-
Oct 22, 2025 09:48 IST
హైదరాబాద్: బకాయిలు అడిగితే విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా?: బండి సంజయ్
విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్తుతో చెలగాటమాడతారా?: బండి సంజయ్
బ్లాక్‌మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా?.. ఆందోళనలు చేపడతాం: బండి సంజయ్
మంత్రులు ప్రతి పనికి కమీషన్లు వసూలు చేస్తున్నారు: కేంద్రమంత్రి బండి సంజయ్
కమీషన్ల సొమ్మును కాంగ్రెస్ హైకమాండ్‌కు కప్పం కడుతున్నారు: బండి సంజయ్
బిహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుంచే పంపుతున్నారా?: కేంద్రమంత్రి బండి సంజయ్
-
Oct 22, 2025 09:48 IST
తెలంగాణలో సమ్మెకు సిద్ధమవుతున్న ఉన్నత విద్యాసంస్థలు
నేడు సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఉన్నత విద్యాసంస్థలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని డిమాండ్
-
Oct 22, 2025 09:47 IST
బుడాపెస్ట్‌లో ట్రంప్, పుతిన్ సమావేశం వాయిదా
అమెరికా, రష్యా విదేశాంగమంత్రుల మధ్య ఫోన్ చర్చలు
ఫోన్ చర్చల అనంతరం వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
సమావేశం నిలిచిపోయేందుకు స్పష్టమైన కారణాలు లేవన్న అమెరికా
ఉపయోగం లేని భేటీకి సమయం వృధా చేసుకోవాలని లేదు: ట్రంప్
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణపై చర్చలకు ట్రంప్, పుతిన్ ప్రయత్నం
చర్చల వల్ల ఎలాంటి ఆశాజనక పరిణామాలు ఉండవని ట్రంప్ వెల్లడి
-
Oct 22, 2025 08:53 IST
యూఏఈ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన
పారిశ్రామిక వేత్తలతో రోడ్ షో, తెలుగు డయాస్పొరా సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు
విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనన్న ముఖ్యమంత్రి
యూఏఈలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ
-
Oct 22, 2025 08:33 IST
ఇథియోపియాలో ఢీకొన్న రెండు రైళ్లు
రైలు ప్రమాదంలో 14 మంది మృతి
-
Oct 22, 2025 08:27 IST
రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయదు: ట్రంప్
భారత ప్రధాని మోదీతో మంగళవారం డొనాల్డ్ ట్రంప్ చర్చలు
ప్రపంచ వాణిజ్యం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు ట్రంప్ వెల్లడి
-
Oct 22, 2025 08:27 IST
మేడ్చల్ లో దారుణం... తండ్రిని హత్య చేసిన కన్న కొడుకు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన..
మద్యం మత్తులో గొడవపడి తండ్రిని చంపిన కొడుకు
సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కొడుకు షేక్ సాతక్
అతని స్నేహితుడు రాజు తో కలిసి మద్యం సేవించి.. మంగళవారం రాత్రి
మద్యం మత్తులో తండ్రి కొడుకు గొడవ
బండ రాయి తో కొట్టి తండ్రిని దారుణ హత్య
కొడుకు తో పాటు స్నేహితుడు రాజు ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
-
Oct 22, 2025 08:27 IST
నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
3 రోజుల పాటు దుబాయ్, అబుదాబి, UAEలో పర్యటన
ఉ.10:15కు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి...
మ.2 గంటలకు దుబాయ్ చేరుకోనున్న చంద్రబాబు బృందం
నవంబర్‌లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు..
విదేశీ పెట్టబడిదారులను ఆహ్వానించనున్న చంద్రబాబు
-
Oct 22, 2025 08:16 IST
ఢిల్లీ: శౌర్య పురస్కారాలకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్
ఆపరేషన్ సిందూర్ సహా రక్షణ బలగాలకు శౌర్య పురస్కారాలు
127 మందికి శౌర్య, 40 విశిష్ట సేవా అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం
విపత్కర పరిస్థితుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు పురస్కారాలు
-
Oct 22, 2025 08:09 IST
నిండుకుండలుగా సోమశిల, కండలేరు డ్యామ్‌లు
పలు ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాకు అంతరాయం
ఈ నెల 25 వరకు వర్షాలు కురిసే అవకాశం
సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని అధికారుల సూచన
-
Oct 22, 2025 08:09 IST
విశాఖ మధురవాడ ఉద్యోగులకు వారుష్ టెక్నాలజీస్ ఐటీ కంపెనీ టోకరా
ఆరునెలలుగా వేతన బకాయిలు చెల్లించకపోవడంతో రోడ్డునపడిన ఉద్యోగులు
ఉద్యోగాల పేరిట రూ.లక్షలు దోచుకున్న సీఈఓ వంకాయల సాయికుమార్
-
Oct 22, 2025 08:06 IST
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ
బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై భేటీలో చర్చ
-
Oct 22, 2025 07:42 IST
నంద్యాల: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు
నవంబర్ 21 వరకు కొనసాగనున్న కార్తీక మాసోత్సవాలు
కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు
రోజూ విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం
-
Oct 22, 2025 07:05 IST
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన
దుబాయ్, అబుదాబి నగరాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
నవంబర్‌లో విశాఖ CII సమిట్‌కు..
విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించనున్న చంద్రబాబు
-
Oct 22, 2025 07:02 IST
అమరావతి: నేడు వైసీపీ నేతలతో జగన్ సమావేశం
భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న జగన్
-
Oct 22, 2025 06:41 IST
అమరావతి: కల్తీ మద్యం కేసు
నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ
-
Oct 22, 2025 06:40 IST
నంద్యాల: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు
నవంబర్ 21 వరకు కొనసాగనున్న కార్తీక మాసోత్సవాలు
కార్తీకమాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు
రోజూ విడతల వారీగా మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం
-
Oct 22, 2025 06:23 IST
నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన
ఎల్లుండి వరకు ఉపసంహరణ గడువు
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్, 14న కౌంటింగ్
-
Oct 22, 2025 06:23 IST
నెల్లూరు: భారీ వర్షాలతో నేడు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లకు సెలవు
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0861 2331261, 7995576699