EPFO liberalises: EPFO గుడ్ న్యూస్: 100 శాతం వరకు విత్‌డ్రా..!
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:43 PM
పీఎఫ్ పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన 13 కఠినమైన నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా మార్పు చేసింది. ‘ముఖ్యమైన అవసరాలు’ (అనారోగ్యం, విద్య, వివాహం), ‘గృహ అవసరాలు’, ‘ప్రత్యేక పరిస్థితులు’ అనే మూడు రకాలుగా వర్గీకరించింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ విషయంలో నిబంధనల సరళీకరణకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ముందుకొచ్చింది. తాజా నిర్ణయంతో వినియోగదారులు. ఉద్యోగి, యజమాని వాటా సహా పీఎఫ్ నిధిలో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. సోమవారం కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ నేతృత్వంలో ఈపీఎఫ్‌వో ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్’ సమావేశం జరిగింది. అనంతరం సీబీటీ ఈ నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఏడు కోట్లకు పైగా వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది.
పీఎఫ్(EPFO) పాక్షిక విత్‌డ్రాకు సంబంధించిన 13 కఠినమైన నిబంధనలను సీబీటీ ఒకే నిబంధనగా మార్పు చేసింది. ‘ముఖ్యమైన అవసరాలు’ (అనారోగ్యం, విద్య, వివాహం), ‘గృహ అవసరాలు’, ‘ప్రత్యేక పరిస్థితులు’ అనే మూడు రకాలుగా వర్గీకరించింది. అలానే విత్ డ్రా(PF withdrawal) చేసుకునే పరిమితిని కూడా పెంచింది. చదువుల కోసం 10 సార్లు, పెళ్లిళ్ల విషయంలో 5 సార్లు వరకు పాక్షిక విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండింటికీ మూడు సార్లే విత్ డ్రా చేసుకునే షర్మిషన్ ఉండేది.
ఇదే సమయంలో అన్ని పాక్షిక ఉపసంహరణలకు వినియోగదారుల కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించింది. గతంలో ‘ప్రత్యేక పరిస్థితులు’ ఆప్షన్ కింద పాక్షిక పీఎఫ్ ఉపసంహరణకు నిరుద్యోగం, ప్రకృతి విపత్తులు, సంస్థల మూసివేత వంటి కారణాలు చూపాల్సి ఉండేది. ఇప్పుడు ఎటువంటి కారణాలు చెప్పకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని సీబీటీ స్పష్టం చేసింది. పీఎఫ్ అకౌంట్ లో జమచేసే మొత్తంలో 25 శాతాన్ని కనీస బ్యాలెన్స్‌గా ఉంచేలా నిబంధన రూపొందించారు. తద్వారా ఈపీఎఫ్‌వో(EPFO withdrawal,) అందించే అధిక వడ్డీ రేటు (ప్రస్తుతం 8.25%), పెద్దమొత్తంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!