Share News

Gold Rate on Oct 13: బంగారం ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:30 AM

బంగారం కొనాలనుకుంటున్నారా? మరి దేశంలోని వివిధ నగరాల్లో రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం పదండి.

Gold Rate on Oct 13: బంగారం ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rates on 13, Oct, 2025

ఇంటర్నెట్ డెస్క్: పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలని భారతీయులు కోరుకుంటారు. మరికొందరు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇలాంటి వారు పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులను నిశితంగా గమనిస్తుండాలి. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు ఆల్‌టైం గరిష్ఠ స్థితిలో కొనసాగుతున్నాయి. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది (Gold, Silver Rates on 13, Oct, 2025).

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం ఉదయం 6.30 గంటలకు 24 క్యారెట్ బంగారం ధర రూ.1,25,070గా ఉంది. 22 ర్యాకెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.1,14,640కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 93,800గా ఉంది. వెండి ధరలో కూడా స్వల్పంగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 1,79,900గా ఉంది. అమెరికా-చైనా వాణిజ్య ప్రతిష్ఠంభన, సుంకాలు, పండుగ సీజన్‌లో డిమాండ్ వెరసి ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.


వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు

  • చెన్నై: ₹1,25,450; ₹1,14,990; ₹94,990

  • ముంబై: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • ఢిల్లీ: ₹1,25,220; ₹1,14,790; ₹93,950

  • కోల్‌కతా: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • బెంగళూరు: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • హైదరాబాద్: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • కేరళ: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • పూణె: ₹1,25,070; ₹1,14,640; ₹93,800

  • వడోదరా: ₹1,25,120; ₹1,14,690; ₹93,850

  • అహ్మదాబాద్: ₹1,25,120; ₹1,14,690; ₹93,850


దేశంలోని వివిధ నగరాల్లో వెండి ధరలు ఇవీ

  • చెన్నై: ₹1,89,900

  • ముంబై: ₹1,79,900

  • ఢిల్లీ: ₹1,79,900

  • కోల్‌కతా: ₹1,79,900

  • బెంగళూరు: ₹1,82,200

  • హైదరాబాద్: ₹1,89,900

  • కేరళ: ₹1,89,900

  • పూణె: ₹1,79,900

  • వడోదరా: ₹1,79,900

  • అహ్మదాబాద్: ₹1,79,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

టీసీఎస్‌లో ఉద్యోగుల తొలగింపులు.. ఈ త్రైమాసికంలో ఏకంగా..

రాంగ్ నంబర్‌కు యూపీఐ పేమెంట్ చేశారా.. ఇలా రిఫండ్ పొందండి..!

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 11:51 AM