Stock Market: అమెరికా-చైనా ట్రేడ్ వార్.. నష్టాల్లో దేశీయ సూచీలు..
ABN , Publish Date - Oct 13 , 2025 | 04:13 PM
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధం ముగియడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపినప్పటికీ, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ఆందోళన కలిగించింది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధం ముగియడం అంతర్జాతీయ మార్కెట్లలో జోష్ నింపినప్పటికీ, చైనా-అమెరికా ట్రేడ్ వార్ ఆందోళన కలిగించింది. చైనాపై డొనాల్డ్ ట్రంప్ వంద శాతం సుంకాలు విధించడంతో అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. ఆ ప్రభావం ఈ రోజు దేశీయ సూచీలపై పడింది. పలు రంగాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత శుక్రవారం ముగింపు (82, 500)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 450 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. మధ్యాహ్నం వరకు భారీ నష్టాల్లోనే కదలాడినప్పటికీ చివర్లో కోలుకుంది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గచూపడంతో నష్టాలు తగ్గాయి. చివరకు సెన్సెక్స్ 173 పాయింట్ల నష్టంతో 82, 327 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 58 పాయింట్ల నష్టంతో 25, 227 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్‌లో కేఫిన్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టొరెంట్ పవర్, ఫోర్టిస్ హెల్త్, ఎమ్‌సీఎక్స్ ఇండియా మొదలైన షేర్లు లాభాలతో ముగిశాయి (share market news). కేన్స్ టేక్నాలజీస్, వోడాఫోన్ ఐడియా, అవెన్యూ సూపర్ మార్కెట్, వోల్టాస్, టాటా మోటార్స్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 64 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.67గా ఉంది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News