Minority Boys Residential School: మైనర్ బాలుడిపై టీచర్ అఘాయిత్యం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:21 PM
దసరా సెలవులకు ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. సెలవులు అయిపోయినా ఆ బాలుడు మాత్రం స్కూలుకు వెళ్లనని ఏడ్వటం మొదలెట్టాడు. తల్లిదండ్రులు ఎందుకని నిలదీయగా టీచర్ గురించి వారికి చెప్పాడు.
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి, సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్లే తప్పుదోవపడుతున్నారు. కొందరు కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. బిడ్డలాంటి విద్యార్థులతో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ టీచర్ బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో మైనారిటీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది.
ఈ స్కూల్లో పని చేసే జువాలజీ టీచర్ కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. ఓ బాలుడ్ని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. దసరా సెలవులకు ఆ బాలుడు ఇంటికి వెళ్లాడు. సెలవులు అయిపోయినా ఆ బాలుడు మాత్రం స్కూలుకు వెళ్లనని ఏడ్వటం మొదలెట్టాడు. తల్లిదండ్రులు ఎందుకని నిలదీయగా టీచర్ గురించి వారికి చెప్పాడు. కొడుకు చెప్పిన విషయాలు విని వారు షాక్ అయ్యారు. ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. జువాలజీ టీచర్ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. విషయం బయటికి రావడంతో సదరు కీచక ఉపాధ్యాయుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. విద్యార్థి మైనర్ కావడంతో విషయం బయటకు రాకుండా పోలీసులు, పాఠశాల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
దొంగ మద్యం వెనుక జగన్ అండ్ కో హస్తం:ఎంపీ కేశినేని శివనాథ్
చరిత్ర సృష్టించిన ప్రణవ్ మహదేవ్.. తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా...