Short Track Ice Skating: చరిత్ర సృష్టించిన ప్రణవ్ మహదేవ్.. తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా...
ABN , Publish Date - Oct 13 , 2025 | 08:41 PM
గత మూడేళ్లుగా ఖేలో వింటర్ గేమ్స్‌లో వరుసగా మెడల్స్ సాధిస్తూ వచ్చాడు. 2025 ఖేలో వింటర్ గేమ్స్‌లో మూడు మెడల్స్ సాధించాడు.
16 ఏళ్ల ప్రణవ్ మహదేవ్ సూరపనేని చరిత్ర సృష్టించాడు. జూనియర్ వరల్డ్ కప్ ఇన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్‌కు ఎంపికైన తొలి తెలంగాణ వ్యక్తిగా రికార్డుకెక్కాడు. త్వరలో కజకిస్తాన్‌లోని అస్తానాలో జరగనున్న ఐస్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ ఏడాది దేశం మొత్తం మీద నుంచి జూనియర్ వరల్డ్ కప్ ఇన్ షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్ పోటీలకు ముగ్గురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. వారిలో ప్రణవ్ మహదేవ్ కూడా ఒకడు. మిగిలిన ఇద్దరు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వారు.

ఏడేళ్ల క్రితం మొదలైంది..
ప్రణవ్ మహదేవ్ ఏడేళ్ల క్రితం తన ఐస్ స్కేటింగ్ ప్రయాణాన్ని మొదలెట్టాడు. కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. కోచ్ ఎమ్ఏ ఖాదీర్ ప్రణవ్ మహదేవ్‌లో ఉన్న సహజ సిద్ధమైన టాలెంట్‌ను గుర్తించారు. ఐస్ స్కేటింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వటం ప్రారంభించారు. ఖాదీర్ శిక్షణలో ప్రణవ్ తన సత్తా చాటుతూ వచ్చాడు. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ .. విజయాలు సాధిస్తూ ముందుకు సాగాడు

గత ఐదేళ్ల నుంచి జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తూనే ఉన్నాడు. ఇండియాలోనే అత్యంత వేగవంతమైన షార్ట్ ట్రాక్ స్కేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత మూడేళ్లుగా ఖేలో వింటర్ గేమ్స్‌లో వరుసగా మెడల్స్ సాధిస్తూ వచ్చాడు. 2025 ఖేలో వింటర్ గేమ్స్‌లో మూడు మెడల్స్ సాధించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నాలుగవ స్థానంలో నిలబెట్టాడు.
ఇవి కూడా చదవండి
న్యూజెర్సీలో క్యాన్సర్ అవగాహన కోసం తానా –గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్
ఏపీ పోలీస్ శాఖ ఇలాగేనా.. హైకోర్టు ప్రశ్నల వర్షం