Share News

TANA And Grace Foundation: న్యూజెర్సీలో క్యాన్సర్ అవగాహన కోసం తానా –గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్

ABN , Publish Date - Oct 13 , 2025 | 07:49 PM

ఈ కార్యక్రమాన్ని గ్రేస్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగాధర్ సుంకర, తానా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నరేపలుపు సమన్వయం చేశారు. న్యూజెర్సీ, పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TANA And Grace Foundation: న్యూజెర్సీలో క్యాన్సర్ అవగాహన కోసం తానా –గ్రేస్ ఫౌండేషన్ 5కే రన్
TANA And Grace Foundation

స్మిత్‌ఫీల్డ్ క్రికెట్ పార్క్‌లో తానా (TANA), గ్రేస్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కమ్యూనిటీ 5కే రన్ విజయవంతంగా జరిగింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు తానా బృందం, గ్రేస్ ఫౌండేషన్ బృందం క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం, ప్రమాదాన్ని తగ్గించే చర్యలు వంటి అంశాలపై సంక్షిప్త అవగాహన సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు జీవనశైలిలో మార్పులు ఎలా చేసుకోవాలన్న విషయంపై అందరూ తమ ఆలోచనలు పంచుకున్నారు. అనంతరం ఆహ్లాదకరమైన వాతావరణంలో 5కే రన్‌ విజయవంతంగా పూర్తి అయింది.

22.jpg


ఇక, ఈ కార్యక్రమాన్ని గ్రేస్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గంగాధర్ సుంకర, తానా రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నరేపలుపు సమన్వయం చేశారు. న్యూజెర్సీ, పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, మాజీ తానా ఫౌండేషన్ కార్యదర్శి విద్య గారపాటి, దశరధ్, రామకృష్ణ వాసిరెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతీ ఒక్కరికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, కొశాధికారి రాజా కసుకుర్తి హృదయపూర్వకంగా అభినందించారు.

33.jpg


ఇవి కూడా చదవండి

గ్రౌండ్‌లో కుప్పకూలిన రాహుల్.. ఏం జరిగిందంటే!

జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారు: జనార్దన్ రావు

Updated Date - Oct 13 , 2025 | 07:53 PM