Kl Rahul Injured: గ్రౌండ్‌లో కుప్పకూలిన రాహుల్.. ఏం జరిగిందంటే!
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:42 PM
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో అల్లాడిపోయాడు. కరేబియన్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్‌కు ప్రైవేట్ పార్ట్ లో తగిలింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మైదానంలో అల్లాడిపోయాడు. కరేబియన్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి రాహుల్‌కు ప్రైవేట్ పార్ట్ లో తగిలింది. దాంతో అతడు గ్రౌండ్ లోనే కుప్పకూలి నొప్పితో విలవిలలాడు. నొప్పికి తట్టుకోలేక మైదానంలో అటుఇటు తిరుగుతూ సతమతమయ్యాడు.
రాహుల్ పరిస్థితిని చూసి టీమిండియా ఫిజియో గ్రౌండ్ లోకి పరుగెత్తుకొచ్చాడు. ఫిజియోను కూడా పట్టించుకోలేనంత దారుణ స్థితిలో రాహుల్ ఉన్నాడు. ఎట్టకేలకు ఫిజియోల సాయంతో ప్రథమ చికిత్స తీసుకొని తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటనతో మ్యాచ్‌కు కాసేపు బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమిండియా(India) 121 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగింది. రెండో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గంటకు 140+ కేఎంపీహచ్ వేగంతో జైడన్ సీల్స్(Jayden Seales) బంతిని సంధించగా రాహుల్.. డిఫెండ్ చేసే ప్రయత్నం చేశాడు. మూడో ఓవర్ తొలి బంతిని ఆపిన రాహుల్.. రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ తరలించాడు. కానీ మూడో బంతిని సీల్స్ లెంగ్త్‌లో వేయగా.. రాహుల్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ బ్యాట్ మిస్సైన బంతి నేరుగా రాహుల్ ప్రైవేట్ పార్ట్ భాగంలో బలంగా తాకింది. దాంతో రాహుల్(KL Rahul) నొప్పితో అల్లాడిపోయాడు.
మరోవైపు టెస్ట్‌లో టీమిండియా విజయం ముంగిట నిలిచింది. టీమిండియా నాలుగో రోజు(India 4th day) ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. విజయానికి మరో 58 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో కేఎల్ రాహుల్(25 *)తో పాటు సాయి సుదర్శన్(30 *) ఉన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో వారికన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్(8)(Yashasvi Jaiswal) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ కు సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్త గురు.. లేకుంటే లైఫ్ మారిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Smriti Mandhana Six Pck: స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్!.. అసలు నిజం ఇదే
Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్..