Share News

IND VS WI 2nd Test: నాలుగో రోజు ముగిసిన ఆట..భారత్ స్కోర్ 63/1

ABN , Publish Date - Oct 13 , 2025 | 06:14 PM

వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఇక విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.

IND VS WI 2nd Test: నాలుగో రోజు ముగిసిన ఆట..భారత్ స్కోర్ 63/1
India 2nd Test

న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ విజయం ఐదో రోజుకు వాయిదా పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. ఇక విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగులు చేసిన యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(25*), సాయి సుదర్శన్ (30*)ఉన్నారు.


ఓవర్‌నైట్‌ 173/2 స్కోరుతో సోమవారం నాలుగో రోజును ప్రారంభించిన విండీస్‌ (West Indies)390 పరుగులకు ఆలౌటైంది. కాంప్‌బెల్ (115), షై హోప్ (103.) సెంచరీలు చేశారు. జస్టిన్ గ్రీవ్స్ (50*), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) రాణించారు. కుల్‌దీప్‌ యాదవ్ 3(Kuldeep Yadav), బుమ్రా 3, సిరాజ్ 2, రవీంద్ర జడేజా(Jadeja), వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 248 పరుగులకే కుప్పకూలి 270 పరుగుల వెనుకంజతో ఫాలో ఆన్‌లో పడింది. కాంప్ బెల్(Bell), హోప్(Shai Hope) సెంచరీలు చేసి.. విండీస్‌ను ఇన్నింగ్స్‌ తేడా ఓటమి నుంచి గట్టెక్కించారు.


సోమవారం ప్రారంభమైన తొలి సెషన్‌లో కాంప్‌బెల్‌ని ఔట్‌ చేసిన కుల్‌దీప్‌ భారత్ ను ట్రాక్ లోకి తెచ్చాడు. ఇక రెండో సెషన్‌లో భారత బౌలర్లు పుంజుకోవడంతో విండీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సెంచరీ చేసిన కాసేపటికే షై హోప్‌ను సిరాజ్‌ బౌల్డ్ చేశాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో టెవిన్ ఇమ్లాచ్ (12), రోస్టన్ ఛేజ్, ఖేరీ పియర్ (12)లు కూడా పెవిలియన్ చేరారు. అలా టీ బ్రేక్ సమయానికి విండీస్ 361/9తో నిలిచింది. చివరి సెషన్‌లో మరో 29 పరుగులు చేసి వెస్టిండీస్ (West Indies)ఆఖరి వికెట్‌ కోల్పోయింది. మ్యాచ్ మూడో రోజు, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్(India Second Innings) తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

Smriti Mandhana Six Pck: స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్!.. అసలు నిజం ఇదే

Shubman Gill: కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డ్..

Updated Date - Oct 13 , 2025 | 06:14 PM