Smriti Mandhana Six Pck: స్మృతి మంధానకు సిక్స్ ప్యాక్!.. అసలు నిజం ఇదే
ABN , Publish Date - Oct 13 , 2025 | 02:49 PM
స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పిక్ లో ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి మంధాన తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్నట్లు ఉంది. ఈ ఫొటోలో స్మృతి మంధాన ఆబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె క్రికెట్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారో.. ఆమె అందానికీ అంతే మంది అభిమానులు ఉన్నారు. ఇక కొందరయితే స్మృతిని హీరోయిన్ గా సినిమాల్లో నటించమనీ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా స్మృతికి సిక్స్ ప్యాంగ్ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిక్ ను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. స్మృతికి సిక్స్ ప్యాకా అంటూ షాక్ అవుతున్నారు. అయితే అది నిజమా, లేక ఫేకా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా స్మృతి మంధానకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పిక్ లో ప్రాక్టీస్ సెషన్‌లో అలిసిపోయిన స్మృతి మంధాన తన టీషర్ట్ పైకెత్తి ముఖం తుడుచుకుంటున్నట్లుగా ఉన్నట్లు ఉంది. ఈ ఫొటోలో స్మృతి మంధాన( Smriti Mandhana ) ఆబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంధాన సిక్స్ ప్యాక్ అంటూ నెటిజన్లు ఈ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ ఫొటో అని స్పష్టంగా తెలుస్తోంది. ఏఐ(AI) జనరేటెడ్ లేదా ఎడిటింగ్ ఫొటో అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఏ మహిళా క్రికెటర్ కూడా తమ టీషర్ట్ పైకెత్తి ఆబ్స్ చూపించుకోరనే విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇది ఫేక్ ఫొటో అని ఎక్స్ ఏఐ ఫ్లాట్‌ఫామ్ గ్రోక్ స్పష్టం చేసింది. స్మృతి మంధాన( Smriti Mandhana Six Pack) సిక్స్ ప్యాక్ సంబంధించిన ఫొటోను ఆమె ఎక్కడా షేర్ చేయలేదని పేర్కొంది. కొందరు ఆకతాయిలు కావాలనే ఈ పిక్ క్రియేట్ చేశారనే విషయం అర్థమవుతుంది.
ఇక మహిళా వరల్డ్ కప్ 2025(Women World Cup 2025) విషయానికి వస్తే.. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో స్మృతి మంధాన అదిరిపోయే ప్రదర్శన చేసింది. 80 పరుగులు చేసి.. భారత్(India) భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. గత రెండు మ్యాచ్ లో విఫలమవుతూ వచ్చిన స్మృతి.. ఆసీస్ మ్యాచ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చింది. దీంతో ఆమె అభిమానులతోపాటు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆసీస్ (Australia) మ్యాచ్ లో స్మృతి మంధాన కష్టం వృథా అయింది. ఈ మ్యాచ్ లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయం చెందింది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!