Unclaimed Financial Assets: మీ డబ్బు. రూ. 2 లక్షల కోట్లు మూలన పడి ఉంది.. వచ్చి తీసుకోండి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ABN , Publish Date - Oct 06 , 2025 | 10:22 AM
మీరు, లేదా మీ కుటుంబీకులు, ఇంకా వారసత్వం రిత్యా మీకు సిద్ధించేటువంటి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల దగ్గర ఉన్నాయి. వచ్చి తీసుకోండి అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్..
ఇంటర్నెట్ డెస్క్: మీరు, మీ కుటుంబీకులు కష్టించి కూడబెట్టిన డబ్బు. దాదాపు రూ. 2 లక్షల కోట్లు మూలన పడి ఉంది.. వచ్చి తీసుకోండి అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె దేశవ్యాప్తంగా ప్రచారానికి గుజరాత్‌లో శ్రీకారం చుట్టారు.
క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులపై దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాన్ని గాంధీనగర్‌లో ప్రారంభించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ప్రముఖులతో కలిసి ప్రసంగించారు. దేశంలో రూ. 1.84 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఆస్తులు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద క్లెయిమ్ చేయని స్థితిలో ఉన్నాయని, అధికారులు వీటిని నిజమైన యజమానులకు చేరేలా చూసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
గుజరాత్ ఆర్థిక మంత్రి కనుభాయ్ దేశాయ్, బ్యాంకులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారుల సమక్షంలో సీతారామన్ గాంధీనగర్ నుండి మూడు నెలల 'అప్కి పూంజి, అప్కా అధికార్' (మీ డబ్బు, మీ హక్కు) ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి కూడా అయిన నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, బ్యాంకు డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్ ఫండ్, షేర్ల రూపంలో బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ. 1.84 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఆస్తులు ఎటువంటి క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయని అన్నారు.
మూడు నెలల పాటు జరిగే ఈ ప్రచారంలో ఈ క్లెయిమ్ చేయని ఆస్తులు.. నిజమైన యజమానులకు చేరేలా చూసుకోవడానికి అవగాహన, యాక్సెస్, చర్య అనే మూడు అంశాలపై పని చేయాలని ఆమె అధికారులను కోరారు.
ఇవి కూడా చదవండి...
నగరంలో ఏం జరుగుతోంది.. ఒకే సారి ఎండ, వాన
భాగ్యనగరంలో దంచికొడుతున్న వర్షం.. పలు కాలనీలు జలమయం
Read Latest Telangana News And Telugu News