BSNL Bumper Offer: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి బంపరాఫర్.. జస్ట్ 1 రూపాయికే..
ABN , Publish Date - Oct 15 , 2025 | 07:02 PM
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి వేళ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలిస్తే వినియోగదారులు ఎగిరి గంతేస్తారంతే. అవును.. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అపరిమిత కాల్స్‌తో..
ముంబై, అక్టోబర్ 15: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి వేళ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి తెలిస్తే వినియోగదారులు ఎగిరి గంతేస్తారంతే. అవును.. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 మెసేజ్‌లు పంపించుకునే వెసులుబాటుతో పాటు.. సిమ్ కూడా ఉచితంగా ఇస్తోంది. ఇదంతా జస్ట్ 1 రూపాయికి మాత్రమే. 300 రూపాయలు లేనిదే ఏ నెట్‌వర్క్ పనిచేయని ఇలాంటి సమయంలో.. కేవలం 1 రూపాయికే ఇవన్నీ కల్పించడం అంటే.. దీపావళి వేళ బంపర్ బొనాంజానే అని చెప్పాలి.
ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తింస్తోందని బీఎస్ఎన్‌ఎల్ స్పష్టం చేసింది. నిర్ణీత సమయంలో ఎవరైతే కొత్త కనెక్షన్ తీసుకుంటారో వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
‘బీఎస్ఎన్ఎల్ స్వదేశీ కనెక్షన్‌తో మీ జీవితాన్ని వెలిగించుకోండి’ అనే ట్యాగ్ లైన్‌తో భారతీయ టెలికాం సేవలు, సరసమైన ప్లాన్‌లను ఇష్టపడే వినియోగదారులను ఆకర్షించడం ఈ ప్రచారం లక్ష్యం. ప్రీపెయిడ్ వినియోగదారులను తిరిగి తమవైపు ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజాను ప్రకటించింది. ముఖ్యంగా బలమైన బ్రాండ్ నమ్మకాన్ని కలిగి ఉన్న గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది బీఎస్ఎన్ఎల్.
ఈ ఆఫర్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే హైస్పీడ్ ఇంటర్నెట్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం రోజుకు 2జీబీ డేటా ఇవ్వనున్నారు. ఇక రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపే అవకాశం ఉంది. అయితే, ఈ ఆఫర్‌లో భాగంగా సిమ్ కూడా ఉచితంగా ఇవ్వనున్నారని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. ఆఫర్ వ్యవధి అక్టోబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని.. అది కూడా కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు.
దీపావళి వేళ టెలికాం ఆపరేటర్లు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేక ప్లాన్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, వీటన్నింటినీ బీట్ చేసింది బీఎస్ఎన్ఎల్. కేవలం 1 రూపాయికే అంటూ ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది బీఎస్ఎన్ఎల్. ఈ ఆఫర్.. జియో, ఎయిర్‌టెల్, విఐ లతో పోటీ పడేందుకు ఉపకరిస్తుందని బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
బట్టలపై మరకలు వదలడం లేదా.. సూపర్ ట్రిక్..
గూగుల్.. జగన్ అండ్ కో గుట్టు రట్టు చేసింది: సోమిరెడ్డి