Share News

Stain removal hack: మీ బట్టలపై మరకలు వదలడం లేదా.. ఈ మహిళ చెప్పిన సూపర్ ట్రిక్ వాడండి..

ABN , Publish Date - Oct 15 , 2025 | 06:31 PM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. అప్పటివరకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనలోకి వస్తున్నాయి. చాలా మంది సాధారణ మహిళలు కూడా ఎన్నో సమస్యలకు సులభమైన పరిష్కారాలు సూచిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు.

Stain removal hack: మీ బట్టలపై మరకలు వదలడం లేదా.. ఈ మహిళ చెప్పిన సూపర్ ట్రిక్ వాడండి..
stain removal trick

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. అప్పటివరకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనలోకి వస్తున్నాయి. చాలా మంది సాధారణ మహిళలు కూడా ఎన్నో సమస్యలకు సులభమైన పరిష్కారాలు సూచిస్తూ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరో ఉపయోగకర వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (viral cleaning video).


@Ayurvedictips అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో, ఒక మహిళ బట్టల నుంచి నూనె మరకలను తొలగించే ఒక ట్రిక్‌ను చూపిస్తోంది (oil stain removal hack). ముందుగా ఆమె ఒక వస్త్రంపై కొన్ని చుక్కల నూనెను వేసింది. ఆ తరువాత నూనె చుక్కలు పడిన చోట పౌడర్ చల్లి దానిపై కాటన్ వస్త్రాన్ని ఉంచింది. ఆ తర్వాత ఆ కాటన్ వస్త్రంపై ఐరన్ బాక్స్ సహాయంతో ఇస్త్రీ చేసింది. కొద్ది సేపటి తర్వాత ఆ పౌడర్‌ను తొలగించినప్పుడు వస్త్రంపై నూనె మరక కనిపించలేదు.


ఈ సూపర్ ట్రిక్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (stain removal trick). ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు 51 వేల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. తెల్లని బట్టల నుంచి మురికిని తొలగించడానికి సులభమైన మార్గం అని ఒకరు ప్రశంసించారు. తాను కూడా ఈ ట్రిక్ ఉపయోగించి చూస్తానని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

1638 క్రెడిట్ కార్డులతో గిన్నీస్ రికార్డు.. ఎలా వాడుతున్నాడంటే..


మీ బ్రెయిన్ సామర్థ్యానికి టెస్ట్.. ఈ ఫొటోలో దాక్కున్న రెండో మనిషిని కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 15 , 2025 | 06:31 PM