ICC fines Team India: భారత్ మహిళా జట్టుకు మరో దెబ్బ
ABN , Publish Date - Oct 15 , 2025 | 06:29 PM
ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ టోర్నీ ప్రారంభంలో శ్రీలంక, పాకిస్థాన్ మీదుగా వరుస మ్యాచ్ లు నెగ్గిన భారత్ మంచి ఫామ్ లో ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఈజీగా గెలవాల్సింది. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
తాజాగా ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయానికి భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకబడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన(ICC Code of Conduct Article) ప్రకారం నిర్దేశిత సమయంలోకా పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల (Slow Over Rate) మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. ఆ నిబంధన ప్రకారమే ఆస్ట్రేలియాతో(Australia) జరిగిన మ్యాచ్ లో భారత్ స్లో ఓవర్ (Slow Over Rate) వేయడంతో ప్లేయర్ల ఫీజుల్లో కోత పడింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్ 2025లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్‌లో జరుగనుంది. ఆ తర్వాత మ్యాచ్ అక్టోబర్ 23న న్యూజిలాండ్(New Zealand)తో ఆడనుంది. ఈ రెండు జట్ల నుంచి భారత్ కు తీవ్ర పోటీ తప్పదు. సెమీస్ కు వెళ్లాలంటే..ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాలి. ఇప్పటికే ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్(England), సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తర్వాత ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Australian Cricketers: పాక్‌తో షేక్ హ్యాండ్ వివాదం..భారత్‌ను ఎక్కిరించిన ఆసీస్ ప్లేయర్లు
Shivam Dube Injured: ఆసీస్ టూర్ వేళ టీమిండియాకు బిగ్ షాక్!